ఆ ఒక్క ఫైటు.. శ్రుతి ఫేటు మార్చింది!

సినిమా – క్రికెట్ రెండూ ఒక్క‌టే. ఏమాత్రం ఫామ్ లో లేని బ్యాట్‌మెన్‌.. మ‌ళ్లీ కుదురు కోవాలంటే ఒక్క ఇన్నింగ్స్ చాలు. సినిమాల్లోనూ అంతే. ఒక్క సినిమా.. ఒక్క సినిమా చాలు. జాత‌కాలు మారిపోవ‌డానికి. ఫ్లాపు స్టార్లు…. హిట్ రేసులో ప‌రుగులు పెట్ట‌డానికి. శ్రుతిహ‌స‌న్ విష‌యంలో అదే జ‌రుగుతోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ శ్రుతిహాస‌న్ ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. శ్రుతిని అవుట్ డేటెడ్ హీరోయిన్ల జాబితాలో చేర్చేశారు. శ్రుతి కూడా తెలుగు సినిమాలు చేయ‌డానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. క్ర‌మంగా శ్రుతి కెరీర్ కి తెలుగులో పుల్ స్టాప్ ప‌డిన‌ట్టే అనిపించింది.

అయితే స‌డ‌న్ గా శ్రుతి ల‌య అందుకోగ‌లిగింది. `క్రాక్‌` విజ‌యం శ్రుతిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌కి కొత్త దారి చూపిస్తోంది. నిజానికి `క్రాక్`లో శ్రుతిది సో..సో పాత్రే. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరోయిన్ ని ఎంత‌టి ప్రాధాన్యం ఉంటుందో.. అంత‌కంటే ఒక మెట్టు త‌క్కువ‌గానే ఉండే పాత్ర అది. అయితే సెకండాఫ్ లో ఒక్క ఫైట్ ఇచ్చి.. శ్రుతి పాత్ర‌ని అమాంతం పైకి లేపేశాడు ద‌ర్శ‌కుడు. ఆ సినిమాలో అది మాస్ కి కిక్కిచ్చే మూమెంట్ మాత్ర‌మే కాదు. శ్రుతి కెరీర్‌కి సైతం ట‌ర్నింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. `క్రాక్‌` హిట్ట‌వ్వ‌డం.. శ్రుతికీ మంచి పేరు రావ‌డంతో.. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు.. త‌మ ప్రాజెక్టుల కోసం శ్రుతిహాస‌న్ పేరూ గ‌ట్టిగానే ప‌రిశీలించ‌డం మొద‌లెట్టారు. `వ‌కీల్ సాబ్`లో హీరోయిన్ గా చేస్తోంది శ్రుతి. `పిట్ట‌క‌థ‌లు` అనే వెబ్ మూవీలో ఓ కీల‌క పాత్ర పోషించింది. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. `స‌లార్‌`లో శ్రుతిని ఓ హీరోయిన్ గా ఎంచుకున్న‌ట్టు టాక్‌. అదే జ‌రిగితే.. శ్రుతి ద‌శ తిరిగిన‌ట్టే. అది ఒక్క సినిమాతో కాదు. అందులోని ఒకే ఒక్క ఫైటుతో. సినిమా సిత్రాల‌న్నీ ఇలానే ఉంటాయి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌...

‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు...

తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం...

పెన్షన్ పెంచుకుంటూ పోయేది వచ్చే ఏడాదే..!

పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ...

HOT NEWS

[X] Close
[X] Close