రేవంత్ జోస్యం : కేటీఆర్‌ను సీఎం చేయరు..!

తెలంగాణలో రేపోమాపో కేటీఆర్ సీఎం అన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలందరూ పోటీ పడి మరీ.. అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలోనే పట్టాభిషేక ముహుర్తం అంటున్నారు. అయితే.. కొంత మంది మాత్రం దీన్ని నమ్మడం లేదు. కేసీఆర్ పదవి వదిలి పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… ఇదే మాట చెబుతున్నారు. కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని.. కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయరని జోస్యం చెప్పారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు.. కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అంటున్నారని విశ్లేషించారు.

బీజేపీ నేతలు కేటీఆర్‌ను సీఎం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు కానీ.. కేసీఆర్ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన కొంత మంది మాత్రం నమ్మడం లేదు. ఇప్పుడు కాదు.. గత నాలుగేళ్ల నుంచి కేటీఆర్‌కు సీఎం పీఠం అనే ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికల్లాంటి పరిస్థితులు వచ్చినా అది గెలవగానే కేటీఆర్‌కు పీఠం అన్న ప్రచారం చేశారు. కానీ ఎప్పుడూ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఓటమి బాటల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు సీఎం పదవి మారిస్తే.. రాజకీయంగా టీఆర్ఎస్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిఉంటుందని రాజకీయపార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ రిస్క్ తీసుకోరని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అదే కారణం అని భావిస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేసేదాకా.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

30 కోట్ల చీకటి డీల్ వెనక ఉన్నది విష్ణువర్ధన్ రెడ్డి మరియు జీవీఎల్: సిపిఐ రామకృష్ణ

ఆంధ్రజ్యోతి పత్రిక తాజాగా రాసిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు బిజెపి నేతలు 30 కోట్ల రూపాయల చీకటి లావాదేవి చేశారని, అది కేంద్ర నిఘా సంస్థల దృష్టికి వెళ్లిందని,...

ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు..! పర్మిషన్ ఇస్తారా..?

వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి.. అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఈ సారి చంద్రబాబు వ్యూహం మార్చారు. నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు....

తిరుపతిలో పోటీకి జనసేన కూడా రెడీగా లేదా..!?

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని.. గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని ప్రకటనలు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు... ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తామే పోటీ...

మోడీ, షాలతో భేటీకి ఢిల్లీకి సీఎం జగన్..!

అత్యవసర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన మోడీతో పాటు అమిత్ షా అపాయింట్‌మెంట్లను కోరారు. ఖరారు అయిన...

HOT NEWS

[X] Close
[X] Close