2020లో పవన్ కల్యాణ్ నుంచి రెండు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు… `పింక్`రీమేక్ పట్టాలెక్కుతుంది. ఆ వెంటనే క్రిష్ సినిమా కూడా మొదలైపోతుంది. మొగలాయిల కాలం నాటి కథ ఇది. అప్పటి పాలన, వాళ్ల నిర్ణయాలుకు.. ఓ కల్పిత కథని జోడించాడట క్రిష్. ఇందులో ఔరంగజేబుదే కీలక పాత్ర. అతని పరిపాలన కాలం నేపథ్యంలో ఈ కథ సాగబోతోంది. ఔరంగజేబు పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడ్ని తెరపైకి తీసుకురావాలని క్రిష్ ఆలోచిస్తున్నాడు. ఈసినిమాకి పాన్ ఇండియా కలరింగు ఇవ్వాలన్నది నిర్మాత ఉద్దేశ్యం. అందుకే ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్‌నటుడ్ని చూపించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైపోయాయి. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. వాళ్లలో ఒకరిని బాలీవుడ్ నుంచే దిగుమతి చేస్తారట.