క్రిష్ త‌న నిజాయ‌తీ నిరూపించుకోవాల్సిందేనా?

క్రిష్ లాంటి ద‌ర్శ‌కులెప్పుడూ మ‌సి పూసి మారేడు కాయ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే… వాస్త‌విక ప్ర‌పంచంలో బ‌తుకుతారు కాబ‌ట్టి. సినిమా విష‌యంలో ఆయ‌న‌కంటూ కొన్ని నియ‌మాలూ, సూత్రాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ జ‌వ దాట‌లేదు. క్రిష్ చేతిలోకి ఓ ప్రాజెక్టు వెళ్లిందంటే.. అది కమ‌ర్షియ‌ల్‌గా హిట్ అయినా, అవ్వ‌క‌పోయినా – క‌చ్చితంగా మంచి ప్ర‌య‌త్నంగా మిగిలిపోతుంది. ఇప్పుడాయ‌న `ఎన్టీఆర్‌`ని తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు. క్రిష్ రాక‌తో ఈ ప్రాజెక్టుపై మ‌రింత ఫోక‌స్ పెరిగింద‌నే విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదు. అయితే.. ఫ‌స్ట్ లుక్‌తో కొన్ని అనుమానాలు ఎదుర్కోవాల్సివ‌చ్చింది. దీన్ని మార్ఫింగ్ చేశార‌ని, బ్లాక్ అండ్ వైట్ కాబ‌ట్టి… మార్ఫింగ్ పెద్ద‌గా తెలియ‌డం లేద‌ని, ఇది నిజ‌మైన లుక్ కాద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. దాన్ని తిప్పికొట్ట‌డానికి క్రిష్ ఈసారి క‌ల‌ర్ ఫొటోని ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన‌యుడిగా బాల‌య్య ఎలా ఉన్నా జ‌నాలు చూస్తారు, ఆద‌రిస్తారు. బాల‌య్య ఎన్టీఆర్‌లా క‌నిపించినా, క‌నిపించ‌క‌పోయినా… ఎన్టీఆర్ వార‌సుడిగా ఆ పాత్ర‌ని ఆయ‌నే బాగా పోషించ‌గ‌ల‌ని అభిమానుల న‌మ్మ‌కం. ఈ ప‌రిస్థితిలో క్రిష్‌కి మ‌సిపూసి మారేడు కాయ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మార్ఫింగ్ ఆలోచ‌న ఆయ‌న‌కెప్పుడూ వ‌చ్చి ఉండ‌దు.

ఈ పాత్ర కోసం బాల‌య్య‌.. అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నాడు. తండ్రి లా మార‌డానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దాని ఫ‌లిత‌మే.. ఈ లుక్‌. దాన్ని మార్ఫింగ్ అని ఇప్పుడే నిందించ‌డం, క్రిష్ లాంటి ద‌ర్శ‌కుడ్ని తొలి అడుగులోనే విమర్శించ‌డం స‌బ‌బు కాద‌నిపిస్తుంది. ఇంకొంత కాలం ఆగాలి. ఇంకొన్ని లుక్‌లు చూడాలి. అప్పుడుగానీ ఓ అవ‌గాహ‌న‌కు రాలేం. ఇదేం మార్ఫింగ్ ఫొటో కాద‌ని… చిత్ర‌బృందంలోని కొంత‌మంది స‌భ్యులు బ‌ల్ల‌గుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఒక‌టి… వెండి తెర‌పై ఇలాంటి మార్ఫింగుల‌కు చోటు లేదు. అక్క‌డ‌ ఎలాంటి జిమ్మిక్కుల చేసినా దొరికిపోతారు. బాల‌య్య‌ని ఎన్టీఆర్‌గా మార్చాల్సిన బాధ్య‌త క్రిష్‌దే. అందులో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారా, లేదా? అనేది తెలియాలంటే… `ఎన్టీఆర్‌` రావాల్సిందే. ఇలా లుక్కులు చూసి ఓ అభిప్రాయానికి రావ‌డం స‌రికాదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close