చిరుకి ‘లైన్’ చెప్పిన క్రిష్‌.. ప‌వ‌న్ కోస‌మేనా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అందుకు చ‌క చ‌క ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ ఏ క‌థ‌ని ఓకే చేస్తాడో తెలీదు గానీ, ద‌ర్శ‌కులు నిర్మాత‌లు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. మెగా కాంపౌండ్‌లో ఎవ‌రు ఏ సినిమా చేసినా, ఆ క‌థ విన‌డం, త‌న అభిప్రాయం చెప్ప‌డం చిరంజీవికి అల‌వాటు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి సంబంధించిన నిర్ణ‌యాల‌న్నీ ప‌వ‌నే తీసుకుంటాడు. ఈ విష‌యాల్లో మ‌రొక‌రి జోక్యం ఏమాత్రం ఉండ‌దు. కాక‌పోతే.. ఈసారి ప‌వ‌న్ చేయ‌బోయే క‌థ చిరు వ‌ర‌కూ వెళ్లింద‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్న‌వాళ్ల‌లో క్రిష్ ఒక‌రు. ఇప్ప‌టికే ఆయ‌న స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల చిరంజీవిని క‌లిసిన క్రిష్‌.. ప‌వ‌న్ కోసం సిద్ధం చేస్తున్న క‌థ గురించి చూచాయిగా వివ‌రించారని తెలుస్తోంది. ఆ క‌థ చిరుకీ బాగా న‌చ్చి ‘గో ఎహెడ్‌’ అంటూ భుజం త‌ట్టాడ‌ట‌. ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించే అవ‌కాశాలున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే క‌థ విష‌యంలో చిరు కూడా శ్ర‌ద్ధ చూపిస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇది వ‌ర‌కు చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని క్రిష్ అనుకున్నాడు. `ఎన్టీఆర్` బ‌యోపిక్ చేస్తున్న‌ప్పుడు చిరు – క్రిష్‌ల మ‌ధ్య భేటీ కూడా అయ్యింది. అది అప్పుడు అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. క‌నీసం ఇదైనా అవుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com