హాట్ స్టార్ కోసం క్రిష్ కొత్త వెబ్ సిరీస్

క్రిష్ లో ఎన్ని క‌ళ‌లో. అత‌నికి ఎన్ని చేతులో. ద‌ర్శ‌కుడిగా త‌నెప్పుడూ బిజీనే. నిర్మాత‌గా కూడా అంతే. ఓ ప‌క్క టీవీ సీరియ‌ళ్లు, ఇంకో ప‌క్క వెబ్ సిరీస్‌లూ. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కమ‌ర్షియ‌ల్ యాడ్లు కూడా తెర‌కెక్కిస్తుంటాడు. ఆహా కోసం క్రిష్ ఆధ్వ‌ర్యంలో కొన్ని వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. అందులో ఒక‌టి స్ట్రీమింగ్ కూడా అవుతోంది. ఆహా కోసం మూడు నాలుగు వెబ్ సిరీస్‌లు రూపొందించే బాధ్య‌త‌ని క్రిష్ మీద వేశారు అల్లు అర‌వింద్‌.

ఇప్పుడు హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నాడ‌ట క్రిష్‌. ఈ మేర‌కు హాట్ స్టార్‌తో ఒప్పందం కూడా కుదిరింది. ఈ వెబ్ సిరీస్‌కి క్రిష్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తారు. నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం క‌థ సిద్ధ‌మ‌వుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో కొంత‌మంది టాలీవుడ్ స్టార్లు కూడా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వెబ్ సిరీస్ ల‌లో బోల్డ్ కంటెంట్‌దే పైచేయి. ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో సాగే క‌థ‌ల‌కూ మంచి గిరాకీ ఉంది. మ‌రి క్రిష్ ఎలాంటి క‌థ‌ని చెప్ప‌బోతున్నాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close