పవన్ కల్యాణ్ పుట్టిన రోజు హడావుడి నెల రోజుల క్రితం నుంచే మొదలైపోయింది. పవర్ స్టార్ కి ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్లు హోరెత్తిపోతున్నాయి. పవన్ పేరే ఎక్కడ చూసినా ట్రెండింగ్ గా నిలుస్తోంది. రేపే..పవన్ పుట్టిన రోజు. ఇప్పుడు చిత్రసీమ నుంచి కూడా హంగామా మొదలైపోయింది. పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటికి సంబంధించిన ఏదో ఓ సర్ప్రైజ్ రేపే రాబోతోంది.
హరీష్ శంకర్ – పవన్ ల కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ సినిమా నిర్మిస్తోంది. రేపు సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్ డేట్ రాబోతోంది. హరీష్ శంకర్ టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ కూడా రేపే రాబోతోంది. క్రిష్ కూడా ఓ అప్ డేట్ ఇవ్వబోతున్నాడు. రేపు మధ్యాహ్నం 12.30కి క్రిష్ సినిమా అప్ డేట్ వస్తోంది. ఈ సందర్భంగా క్రిష్ కూడా తన సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నాడేమో అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ టైటిలే ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.