టార్గెట్ ఫిక్స్: 60 రోజుల్లో రీమేక్ పూర్తి చేయ‌మ‌న్న ప‌వ‌న్‌

`అప్ప‌య్యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నాడ‌న్న వార్త టాలీవుడ్ లో గ‌ట్టిగానే చ‌క్క‌ర్లుకొడుతోంది. ప‌వ‌న్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. అవ‌న్నీ పూర్తి కాకుండా… మ‌రో సినిమా ఎలా ఒప్పుకుంటాడ‌న్న‌ది అంద‌రిలో ఉన్న డౌటు. కాక‌పోతే.. ప‌వ‌న్ ఈ రీమేక్ చేయాల‌నే ఫిక్స‌య్యాడ‌ని స‌మాచారం. అయితే రెండు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేస్తేనే ఒప్పుకుంటాని టార్గెట్ ఫిక్స్ చేశాడ‌ట‌. 60 రోజుల్లో ఈ రీమేక్ పూర్త‌య్యే అవ‌కాశాల్ని కొట్టిపారేయ‌లేం. ఎందుకంటే.. భారీ హంగుల‌న్న సినిమా కాదిది. ఇప్ప‌టికే స్క్రిప్టు సిద్ధంగా ఉంది. కాక‌పోతే.. మ‌రో హీరో ఎవ‌ర‌న్న‌దీ తేలాలి. ఈ సినిమా చేయ‌డానికి ర‌వితేజ‌, రానా లాంటి హీరోలు సిద్ధంగానే ఉన్నారు. రెండో పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తి పేరు కూడా ప‌రిశీల‌న‌లో వుంది. ఆ రెండో హీరో ఎవ‌ర‌న్న‌ది తేలిపోతే – వాళ్ల కాల్షీట్ల‌ని బ‌ట్టి ఈ సినిమాని చ‌క చ‌క పూర్తి చేయొచ్చు. వ‌కీల్ సాబ్ పూర్త‌యిన వెంట‌నే క్రిష్ సినిమా మొద‌లెట్టాలి ప‌వ‌న్‌. అయితే.. క్రిష్ మ‌రో ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు. క్రిష్ ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలోగా.. ఈ రీఏమేక్ ప‌ని ప‌ట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ప్లాన్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close