వంశీ కోసం పాత క‌థే బ‌య‌ట‌కు తీశారా??

వంశీ స్వ‌త‌హాగా మంచి క‌థ‌కుడు. ఆయ‌న సినిమాల కంటే క‌థ‌లే బాగుంటాయ‌న్న‌ది సాహితీకారులు, చ‌ద‌వ‌రుల అభిప్రాయం. సో.. వంశీ ద‌గ్గ‌ర సినిమా క‌థ‌ల‌కేం కొర‌త లేక‌పోవొచ్చు. అయినా స‌రే.. అప్పుడ‌ప్పుడూ ప‌క్క ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌తో సినిమాలు తీస్తుంటారు వంశీ. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ సినిమా క‌థ కూడా వంశీది కాదు. ఇప్పుడు మ‌రోసారి వంశీ బ‌య‌టి క‌థ‌తో సినిమా తీయ‌డానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. ఈసారి వంశీకి క‌థ అందిస్తోంది ఎవ‌రో కాదు… హాస్య న‌టుడు కృష్ణ భ‌గ‌వాన్‌. వంశీకీ ఈయ‌న‌కూ మంచి ఎటాచ్‌మెంట్ ఉంది లెండి. ఇద్ద‌రూ గోదారోళ్లే. దానికి తోడు.. కృష్ణ‌భ‌గ‌వాన్ ని సినిమాల్లో ఇంట్ర‌డ్యూస్ చేసింది వంశీనే. ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారుతో కృష్ణ‌భ‌గ‌వాన్‌కి మంచి బ్రేక్ వ‌చ్చింది. అప్ప‌ట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

ఇప్పుడు ఆ అనుబంధంతోనే వంశీకి కృష్ణ‌భ‌గ‌వాన్ ఓ క‌థ ఇచ్చాడ‌ట‌. అయితే.. ఇదేం కొత్త క‌థ కాదు. అల్ల‌రి న‌రేష్ కోసం అప్పుడెప్పుడో క‌థ రెడీ చేశాడు కృష్ణ‌భ‌గ‌వాన్‌. అలా ఎలా ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెప్పుకొన్నారు. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్టు వ‌ర్కవుట్ కాలేదు. అప్ప‌ట్నుంచీ ఆ క‌థ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు దాన్నే.. వంశీ చేతిలో పెట్టాడ‌న్న‌మాట‌. ఈసారి ఆ క‌థ‌ని అల్ల‌రి న‌రేష్ తో తీస్తారా, లేదంటే కొత్త హీరోని వెదుక్కొంటారా అనేది తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com