ట్రైల‌ర్ టాక్‌: ఉంగ‌రాల రాంబాబు

ఓ హిట్టు కోసం ఆప‌సోపాలు ప‌డిపోతున్నాడు సునీల్‌. క‌మెడియ‌న్‌గా హ్యాపీగా న‌డిచిపోయిన‌ సునీల్ కెరీర్‌.. హీరోగా మాత్రం కుదుపుల మ‌యంగా సాగుతోంది. త‌ఢాకా త‌ర‌వాత‌.. సునీల్ హిట్టు మొహ‌మే చూళ్లేదు. ఇప్పుడు సునీల్ ఆశ‌ల‌న్నీ ‘ఉంగ‌రాల రాంబాబు’పైనే. ఫీల్ గుడ్ సినిమాలు తీసిన క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. టైటిల్ క్యాచీగా ఉంది. ఆపాత్ర‌… సునీల్‌కి భ‌లే బాగా సూటైపోతుంద‌న్న న‌మ్మ‌కం కూడా క‌లుగుతుంది. దాంతో… ఈ సినిమాపై కాస్త ఇంప్రెష‌న్ ప‌డింది. అయితే… షూటింగ్ ద‌శ‌లోనే చాలా కాలం ఉండిపోవ‌డం, సినిమా పూర్త‌యినా విడుద‌ల‌కు టైమ్ తీసుకోవ‌డంతో ఆ హైపూ… త‌గ్గుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు నిర్మాత‌ల‌కు కాస్త మూడ్ వ‌చ్చి… ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది.

నిమిషంన్న‌ర సాగిన ఈ ట్రైల‌ర్‌లో ఒక్క ఫ్రేమ్ కూడా కొత్త‌గా అనిపించ‌లేదు. ఒక్క డైలాగూ పండ‌లేదు. క‌మెడియ‌న్ల గుంపు ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఆ పంచ్‌ల‌న్నీ… థియేట‌ర్‌లోనే పంచాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లంతా డిసైడ్ అయ్యారేమో. టైటిల్‌కి త‌గ్గ‌ట్టు చేతినిండా ఉంగ‌రాల‌తో, రంగు రంగుల డ్ర‌సుల‌తో క‌నిపిస్తున్నాడు సునీల్‌. హీరోయిజం అనే ఎలిమెంట్ దాచేసి, ఈ సినిమాలో కామెడీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు అర్థం అవుతోంది. కాక‌పోతే.. సునీల్ నుంచి స‌రైన పంచ్ ప‌డ‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ బాగానే ద‌ట్టించిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర్లో ప్ర‌కాష్‌రాజ్ సునీల్‌నిచూపిస్తూ.. ‘ఎలా న‌చ్చాడ‌మ్మా వీడు.. ‘ అంటాడు. ట్రైల‌ర్‌దీ అదే ప‌రిస్థితి. క‌నీసం సినిమా అయినా బాగుంటుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close