కృష్ణ‌వంశీకి బాల‌య్య భ‌రోసా!

నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమా మొద‌ల‌య్యే ముందు భారీ క‌స‌ర‌త్తే జ‌రిగింది. ఎంతో మంది ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. కృష్ణ‌వంశీ సినిమా అయితే సిట్టింగులు మొద‌లైపోయాయి. షూటింగ్ డేట్ కూడా దాదాపుగా ఖ‌రారు చేసుకొన్న‌దే. అయితే స‌డ‌న్ గా సీనులోకి క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి ప‌ట్టాలెక్కేసింది. బాల‌య్య‌తో అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని సంతోష‌ప‌డ్డ కృష్ణ‌వంశీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది. అయితే.. కృష్ణ‌వంశీ అంత బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆ ఆఫ‌ర్ ఎక్క‌డికీ పోలేదు. `త‌ర‌వాత నీతోనే సినిమా.. రెడీగా ఉండు` అంటూ కృష్ణ‌వంశీకి భ‌రోసా ఇచ్చేశాడు బాల‌య్య‌.

బాల‌య్య వందో సినిమా కోసం క‌థ‌లు వింటున్న‌ప్పుడు కృష్ణ‌వంశీకూడా బాల‌య్య‌తో మీటింగ్ పెట్టి ఓ క‌థ వినిపించాడు. అయితే ఆ క‌థ అంత‌గా న‌చ్చ‌లేదు బాల‌య్య‌కు. దాంతో కృష్ణ‌వంశీ అప్పుడే సైడ్ అయిపోయాడు. కొన్నాళ్ల‌కు బాల‌య్య ద‌గ్గ‌ర‌కు ఓ మంచి క‌థ వ‌చ్చింది. అయితే దాన్ని డైరెక్ట్ చేసేవాళ్లు క‌నిపించ‌లేదు. ‘ఇలాంటి క‌థ‌ళ‌ల‌కు కృష్ణ‌వంశీ అయితే బాగా న్యాయం చేస్తాడు’ అనిపించింది బాల‌య్య‌కు. దాంతో… కృష్ణ‌వంశీ లైన్లోకి వ‌చ్చాడు. స్క్రీన్ ప్లే వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా… గౌత‌మి పుత్ర క‌థ వ‌చ్చింది. దాంతో మ‌ళ్లీ బాల‌య్య‌.. కృష్ణ‌వంశీ క‌థ ప‌క్క‌న పెట్టాడు. అయితే ‘కృష్ణ‌వంశీని పిలిచింది నేనే క‌దా’ అని బాల‌య్య‌కు అనిపించిందేమో. . కృష్ణ‌వంశీ నిరుత్సాహ‌ప‌డ‌కూడ‌న్న‌ద ఉద్దేశంతో ఇప్పుడు మ‌ళ్లీ పిలిచి ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. 101వ సినిమా కృష్ణ‌వంశీతోనే అని బాల‌య్య కాంపౌండ్ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఇచ్చిన మాటపై నిల‌బ‌డ‌తాడ‌ని బాల‌య్య‌కు మాంఛి పేరుంది. అది మ‌ళ్లీ రుజువైపోలేదూ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close