కృష్ణంరాజుకు మళ్ళీ మొండి చేయి

బిజెపి అధిష్టానం బిజెపి నేత కృష్ణంరాజు కి మళ్లీ మొండిచేయి చూపింది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం, ఎప్పటినుండో గవర్నర్ పదవిని ఆశిస్తున్న కృష్ణం రాజు కు మాత్రం ఆశాభంగం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

పలు రాష్ట్రాల కి గవర్నర్ లని నియమిస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీ టాండన్, బీహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా ఆనంది బెన్ పటేల్, త్రిపుర గవర్నర్గా రమేష్ బయాస్, నాగాలాండ్ గవర్నర్గా రవి లని బిజెపి నియమించింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒరిస్సాకి చెందిన సీనియర్ బిజెపి నేత బిశ్వ భూషణ్ ని గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.

అయితే మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు, 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత బిజెపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. అయితే ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరి తాను చారిత్రక తప్పిదం చేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు వైఎస్ జగన్ కి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, అధికారికంగా వైఎస్ఆర్సిపిలో కృష్ణంరాజు చేరతారేమో అన్న ఊహాగానాలు వచ్చినప్పటికీ, 2014 మోడీ హయాంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణంరాజు తిరిగి తన సొంత గూటికి చేరిపోయారు. అయితే పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్న విద్యాసాగరరావు లాంటి నేతలకు గవర్నర్ పదవి లభించినప్పటికీ, తిరిగి చేరిన కృష్ణంరాజు కు బిజెపి తరఫున పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అయితే కృష్ణంరాజు మాత్రం తాను బీజేపీలో నే ఉంటా అని, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను బిజెపిని వీడనని, అయితే గవర్నర్ పదవి ఇస్తే మాత్రం తప్పకుండా ఆ బాధ్యతను స్వీకరిస్తానని బాహాటంగా వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ప్రస్తుతం చేసిన నియామకాల్లో కృష్ణంరాజు పేరు ఎక్కడా కనిపించకపోవడంతో, గవర్నర్ కావాలన్న ఆయన ఆశ ప్రస్తుతానికి మాత్రం అడియాసే అని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ టైటిల్‌… క్రిష్ సైలెన్స్‌

ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ పై ఉందంటే.. దాని చుట్టూ బోలెడ‌న్ని ఊహాగానాలు. ప్రీ లుక్ చూసి, అందులో హీరో గెట‌ప్ ని చూసి క‌థేంటో ఊహించేస్తారు ఫ్యాన్స్‌. పోస్ట‌ర్లూ, టైటిళ్లూ...

ధోనీ భ‌య‌ప‌డుతున్నాడా?

ప్ర‌పంచ క్రికెట్‌లో ధోనీ అత్యుత్త‌మ ఫినిష‌ర్‌. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. చేజారిపోయాయి అనుకున్న మ్యాచ్‌లను ర‌క్షించ‌గ‌ల‌డు. అలాంటి ధోనీ ఇప్పుడు బ్యాటింగ్ కి రావాలంటే భ‌య‌ప‌డుతున్నాడా? వీలైనంతగా బ్యాటింగ్‌కి...

ఆ చెక్కుల స్కామ్‌లో సూత్రధారి భాస్కర్ రెడ్డి..! తెర వెనకెవరు..?

ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ నుంచి రూ. 117 కోట్లు కొట్టేయాలనుకున్నది ఎవరో ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వైసీపీ చోటా నేత భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. చీఫ్...

క్రైమ్ : తెలుగు రాష్ట్రాల్లో “ధూమ్‌” దొంగలు..!

ధూమ్ సినిమాలో బైకుల మీద వచ్చి దోపిడీ చేసెళ్లిపోతారు. కానీ ఇక్కడ అసలైన దొంగలు మాత్రం ఖరీదైన కార్లలో వచ్చి కనీసం కంటికి కూడా కనిపించంకుండా... దోపిడీ చేసుకెళ్లిపోతున్నారు. వారేమీ చైన్ స్నాచింగ్‌లు...

HOT NEWS

[X] Close
[X] Close