“బిగ్ బాస్” వాయిదా యోచనలో స్టార్ మా..!

బిగ్ బాస్ మూడో సీజన్‌కు ఆరంభ గండం ఎదురయింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, కోర్టుల్లో కేసులు, నాగార్జున హోస్టింగ్ పై వస్తున్న విమర్శలు.. కలగలిపి.. ఈ షో మొత్తానికే వాయిదా పడే పరిస్థితి వచ్చింది. నాగార్జున ఇంటిని, అన్నపూర్ణా స్టూడియోనూ.. ఓయూ విద్యార్థులు ముట్టడించారు. అంతకు ముందే… బిగ్ బాస్ నిర్వాహకులు.. అవకాశాల పట్ల.. నటీమణులతో .. కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నారని..మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. పరిస్థితి రాను రాను సీరియస్‌గా మారుతోంది. దీంతో.. నాగార్జున కూడా హోస్ట్‌గా ఉండేందుకు వెనుకాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరుణంలో.. నాగార్జునతో.. స్టార్ మా ప్రతినిధులు భేటీ అయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు.

నిజానికి బిగ్ బాస్ మూడో సీజన్ ఆదివారం నుంచి.. అంటే రేపటి నుంచే ప్రారంభం కానుంది. షో ప్రతీ సారి ఒక రోజు ముందుగానే ఉంటుంది కాబట్టి.. కంటెస్టంట్లు అంతా.. ఈ పాటికి బిగ్ బాస్ హౌస్‌లోకి చేరుకుని ఉంటారు. ఓపెనింగ్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేసి ఉంటారు. అయితే.. నాగార్జున.. హోస్ట్ గా ఉండేందుకు వెనుకాడుతూండటం.. అదే సమయంలో… వివాదాలు పెరిగిపోతూండటంతో… షోను.. వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో.. స్టార్ మా యాజమాన్యం ఉన్నట్లుగా చెబుతున్నారు. బిగ్ బాస్ షోలోకి తమకు అవకాశం రాకపోవడానికి కారణం కాస్టింగ్ కౌచేనని.. శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. బిగ్ బాస్ నిర్వాహకులు.. అరెస్ట్ చేయకుండా.. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటితో వదిలి పెట్టబోమని.. గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుతం స్టార్ మాలో.. బిగ్ బాస్ ప్రమోషన్లు కూడా..కనిపించడం లేదని.. ప్రేక్షకులు చెబుతున్నారు. వాయిదా దిశగా ఉండటం వల్లనే… పెద్దగా హైలెట్ చేయడం లేదని.. భావిస్తున్నారు. అదే సమయంలో.. ప్రొకబడ్డీకి మాత్రం.. ఎక్కడ లేని పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బిగ్‌బాస్ షోను వాయిదా వేసి.. వివాదాలన్నీ పరిష్కరించుకున్న తర్వాతనే ప్రారంభించవచ్చని… టీవీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి..షో రేపే ప్రారంభం కాబట్టి… ప్రారంభిస్తారో.. వాయిదా వేస్తారో.. ఈ రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close