రివ్యూ : ‘కృష్ణాష్టమి’ – రొటీన్ ఫార్ములా చిత్రం

కమెడియన్‌ సునీల్ పది ఏళ్ళ క్రితం ‘అందాల రాముడు’ చిత్రం తో హీరో గా పరిచయమై ఆ తరువాత మర్యాద రామన్న, పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు చిత్రాలతో డాన్సింగ్ స్టార్ గా మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. హీరో గా రెండేళ్ళ గ్యాప్ తర్వాత ‘కృష్ణాష్టమి’ చిత్రంతో మళ్లి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీల్ .ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాను ‘జోష్’తో పరిచయమైన వాసువర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్స్ జరిగినపుడల్లా మా సంస్థ లో నిర్మించిన ‘బొమ్మరిల్లు’ రేంజ్ సినిమా అవుతుందని ఘంటా పదం గా చెప్పుకొస్తున్న దిల్ రాజు నమ్మకాన్ని, ‘కృష్ణాష్టమి’ ఆ చిత్రం రేంజ్ ని నిలబెట్టిందో లేదో తెలుసుకుందాం…

కథ:

అమెరికాలో సొంతంగా గేమింగ్ ప్రోగ్రామర్‌గా పని చేసి బాగా సంపాదిస్తాడు కృష్ణ వర ప్రసాద్ (సునీల్). తన మాతృ భూమి ఇండియా లో తన కుటుంబ సబ్యులతో గడపాలని 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటాడు, కలలు కంటుంటాడు. ఈ విషయం లో అతడి పెదనాన్న (ముఖేష్ రుషి) మాత్రం ఇండియాకు రాకుండా ప్రయత్నాలు చేస్తూంటాడు. అయిన సరే తన కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనుకున్న కృష్ణ, ముందస్తు ఎవ్వరికీ చెప్పకుండా ఇండియాకు ప్రయాణమవుతాడు. ఈ ప్రయాణం నేపధ్యం లో అతడు పల్లవి (నిక్కీ గల్రాని) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. కాగా కృష్ణ ఇండియా కి రాగానే అతడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. అనుకోకుండా అతడు చిత్తూరు జిల్లాలోని ఓ ఊర్లో ఒక ఫ్యాక్షన్ కుటుంబానికి అల్లుడిగా నటించాల్సి వస్తుంది. ఎందుకు కృష్ణ ఇండియాకు రాకుండా అతడి పెదనాన్న అడ్డు పడుతూ ఉంటాడో ? చిత్తూరులోని ఫ్యాక్షన్ కుటుంబానికి కృష్ణకు గల ఉన్న సంబంధం ఏమిటో ? పల్లవితో కృష్ణ ప్రేమ ఎటువైపు దారి తీస్తుందో ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటులు పెర్ ఫామెన్స్:

హీరో సునీల్ పూర్తి స్థాయి హీరోగా గత చిత్రాలలో ఎలా చేసాడో అలానే చేశాడు. కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో సునీల్ తన దైన మార్క్ చూపెట్టాడు అంతే తప్పా, గొప్పగా చెప్పు కోడానికి ఏమి లేదు. కొన్నిముఖ్య మైన సన్నివేశాల్లో కూడా కళ్ళద్దాలు పెట్టుకోవడం, క్లోజప్ షాట్స్ లాంటివి చాలా తక్కువ చూపడం ప్రశ్న గా మిగులుతుంది. ఈ సినిమాలో అతను స్పెషల్ గా చేసిందేమీ లేదన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. బ్రహ్మానందం, ఆశుతోష్ రానాలు ఓ కామెడి సన్నివేశం లో బాగా నవ్వించారు. అజయ్, అతడి కుమారుడి నేపథ్యంలోని వచ్చిన చిన్ని ఉపకథ బాగుంది.నిక్కీ గల్రాని, డింపుల్ చోపాడే.. ఇద్దరూ హీరోయిన్లూ వీలైనంత అందాల ప్రదర్శనతో ఆకట్టు కున్నారు. నటన పరంగా నిక్కీ గల్రాని ఫర్వాలేదు. ఇక ముఖేష్ రుషి, పోసాని , తులసి, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిదిలో బాగానే చేశారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వాసువర్మ గురించి చెప్పుకుంటే, ఆయన రాసుకున్న అసలు కథలోని బేసిక్ ఎమోషన్ బాగున్నా, కధనం లో ఎక్కడా విషయం లేదు. ఇక దానికి వాసువర్మ రాసుకున్న స్క్రీన్‌ప్లే కూడా సాదాసీదాగా తెలుగు సినిమాకు ఉండాల్సిన ఫార్మాట్‌లో నే ఉంది. దర్శకుడిగా వాసు వర్మ టాలెంట్ పెద్దగా ఎక్కడ కనపడదు. ఏమీ చూపలేదు కూడా, తెలిసిన కథనే, తెలిసిన స్క్రీన్‌ప్లేతో, సాదాసీదా మేకింగ్‌తో కలిపి దర్శకత్వం పరంగా కేవలం ఫర్వాలేదని పించాడు . ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు పనితనాన్ని మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.తన విజన్ తో కట్టిపడేశాడు. యూరప్, అమెరికాల్లోని అందమైన లొకేషన్స్‌ను మరింత అందంగా చూపించడంతో పాటు సెకండాఫ్‌లో సినిమా ఎమోషన్‌కు తగ్గ మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో ఛోటా ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అన్నింటికీ మించి కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో ఛోటా చేసిన ప్రయోగం చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దినేష్ అందించిన పాటల్లో రెండు వినడానికి బాగున్నాయి. మిగతావన్నీ రొటీన్‌గా, పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రం గానే వుంది. ఇక ఎడిటింగ్ పరంగానూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని విధానం చాలా చోట్ల కనిపిస్తుంది. దిల్‌రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గత చిత్రాల లాగే ఎప్పట్లానే వున్నాయి.

విశ్లేషణ:

కమెడియన్‌గా స్టార్‌డమ్ తెచ్చుకున్న సునీల్, హీరోగానూ అదే స్టార్‌డమ్ సంపాదించుకునే దిశగా రెండేళ్ళ గ్యాప్ తీసుకుని మరీ ‘కృష్ణాష్టమి’ అన్న సినిమాతో వచ్చేశాడు. ఒక స్టార్ హీరో అంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్నీ పండించాలన్న పరిస్థితుల మధ్యన స్టార్ హీరో మార్క్ కోసం సునీల్ చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణాష్టమి’. అయితే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కథే లోపం. రొటీన్ అవ్వడం, ఎందుకొస్తున్నాయో తెలియని పాటలు, లాజిక్ లేని సిల్లీ సన్నివేశాల్లాంటి చాలా మైనస్‌లున్నాయి. ఇక మెప్పించే అంశాలేవైనా ఉన్నాయాంటే.. అక్కడక్కడా నవ్వించే కామెడీ, సునీల్ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్.మొదట్నుంచీ చివరివరకూ ఎక్కడా మారకుండా ఉన్న ఫ్యామిలీ ఎమోషస్స్ గురించి చెప్పుకోవచ్చు. కృష్ణ, తన కుటుంబంతో గడపాలని 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తూండడం, అతడి పెద్దమ్మతో పాటు ఆ కుటుంబం అంతా కూడా కృష్ణను చూడాలనుకోవడం, ఈ మధ్యలో చిన్న ట్విస్ట్.. ఇలాంటి అంశాలు హైలైట్‍గా చెప్పుకోవచ్చు. పాటల్లో అందమైన లొకేషన్స్‌ మంచి రిలీఫ్. సినిమా ఫ్లో పరంగా చూసుకుంటే, ప్రీ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఒక ఛేజింగ్ సీన్ మేకింగ్ పరంగా సినిమాకె మేజర్ హైలైట్స్. రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ లాంటి అంశాలను ఈ విషయం లో ప్రస్తావించుకోవచ్చు. సెకండాఫ్‌లో సన్నివేశాలన్నీ కథ పరంగా కాకుండా అక్కడి కక్కడ పేర్చుకు పోయినట్లు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కమర్షియల్ హంగులను నింపుకుంటూ నడిచే సినిమాలో ఎక్కడా లాజిక్ అన్నదే కనపడదు. కమర్షియల్ సినిమా అనుకొని కొన్ని చిన్న లాజిక్‌లను పక్కనబెట్టినా, సినిమాలో ప్రధానమైన ఉపకథలన్నింటినీ అసలు కథకు కలిపే విధానంలో సక్సెస్ కాలేక పోయారు. ఇక ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చూస్తే, కధానాయికల పాత్రలకు కనీస వ్యాల్యూ ఇవ్వకపోవడమనే అంశమే ఆలోచనలో పడేస్తుంది. చివరాఖరుగా చెప్పాలంటే…ఓ సాదా సీదా రొటీన్ ఫార్ములా చిత్రం… బొమ్మరిల్లు లో టెన్ పెర్సెంట్ రేంజ్ కూడా లేదు.

తెలుగు360.కామ్ రేటింగ్‌: 2/5

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్
నటి నటులు : సునీల్ , నిక్కి గల్రాని, డింపుల్ చోపాడే, బ్రహ్మానందం, ముకేష్ రుషి, ఆశుతోష్ రానా, పవిత్ర లోకేష్, సప్త గిరి , తులసి , పోసాని మురళి ,
సినిమాటోగ్రఫీ : ఛోటా కె. నాయుడు,
సంగీతం : దినేష్ కనక రత్నం,
కో -ప్రొడ్యూసర్స్ : శిరీష్ – లక్ష్మన్,
నిర్మాత : ‘దిల్’ రాజు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : వాసు వర్మ
విడుదల తేది : 19.02.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో…

ఒక‌ప్పుడు కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా క‌నిపించిన పేరు.. ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు అన్నీ హిట్లే. హీరోగా మారాక ఆయ‌న కెరీర్ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోయింది. ద‌ర్శ‌కుడిగానూ బ్యాక్ స్టెప్ వేయాల్సివ‌చ్చింది....

రామ్ చ‌ర‌ణ్ కోసం ప్లాన్ బి

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇది వ‌ర‌కే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌పై యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ షెడ్యూల్‌కి...

తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.....

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

తెలంగాణతో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. స్మూత్‌గా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాల్సిన ఏపీ ప్రభుత్వం... అనవసర వివాదంతో.. కేఆర్ఎంబీ దృష్టిలో పడేలా చేసుకుంది. ఫలితంగా.. ఇప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉంటే తప్ప.....

HOT NEWS

[X] Close
[X] Close