కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ఒక్క సారిగా రెండు జట్ల టీమ్ మేనేజ్‌మెంట్లు ఉలిక్కిపడ్డాయి. వెంటనే మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. బయోబబుల్‌లో ఉన్న కృనాల్‌కు ఎక్కడ కరోనా పాజిటివ్ అంటుకుందో ఎవరికీ అర్థం కాలేదు.

కానీ పాజిటివ్‌గా వచ్చిన పాండ్యాకు ఎలాంటి లక్షణాలు లేవని తెలుస్తోంది. వెంటనే.. మిగతా ఆటగాళ్ల శాంపిల్స్ తీసుకుని ఆర్టీ పీసీఆర్ పరీక్షల శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. వారిలో ఎవరికీ పాజిటివ్ రాకపోతే.. మరో రెండు టీ ట్వంటీలను యధావిధిగా బుధవారం నిర్వహిస్తారు. పొరపాటున మరెవరికైనా పాజిటివ్‌ అని తేలితే మాత్రం సీరిస్‌ను ఇక్కడితో ఆపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయోబబుల్ లో ఉన్న వారికి పాజిటివ్ రాదని అనుకుంటూ ఉంటారు. ఐపీఎల్‌లో బయోబబుల్ బ్రీచ్ చేయడంతో కొంత మందికి కరోనా సోకింది. దీంతో టోర్నీనే వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇప్పుడు శ్రీలంకటూర్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కృనాల్ పాండ్యాతో పాటు టీమ్‌లో ఉన్న వారందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లండన్‌లో మరో భారత జట్టతో సూర్యకుమార్ యాదవ్, ఫృధ్వీ షా కలవాల్సి ఉంది. వారు ఇప్పుడు లండన్‌కు బయలుదేరడంపై సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి కరోనా అదే పనిగా.. క్రికెట్‌ను వెంటాడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close