జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి. తెలంగాణ‌లో ఎలాంటి గొడ‌వా లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం చిత్ర‌సీమ‌కు కావ‌ల్సినంత చేయూత ఇస్తోంది. థియేట‌ర్ల పునః వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు అండ‌గా ఉంది. పార్కింగ్ ఫీజు వ‌సూలు చేసుకునే హ‌క్కుని థియేట‌ర్ల యాజ‌మాన్యానికి ఇచ్చింది. టికెట్ రేట్ల విష‌యంలోనూ ప‌ట్టువిడుపులు ప్ర‌ద‌ర్శించింది. కానీ… ఆంధ్రాలో అలా లేదు. త‌గ్గించిన టికెట్ రేట్ల‌ని స‌వ‌రించే విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేదు. అస‌లు ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎలా ఉండ‌బోతున్నాయి? అనే విష‌యాల్లో ఎలాంటి స్ప‌ష్ట‌తా లేదు. పైగా నైట్ షోల‌కు ఏపీలో అనుమ‌తి లేదు. అక్క‌డ 50 శాత‌మే ఆక్యుపెన్సీ. ఇన్ని ప‌రిమితుల మ‌ధ్య ఏపీలో సినిమాల్ని విడుద‌ల చేసుకోవాల్సి ఉంది. అయినా స‌రే… ఇష్క్‌, తిమ్మ‌రుసులు బ‌రిలోకి దిగుతున్నాయి.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ని క‌లుసుకుని, త‌మ బాధ‌లు చెప్పుకోవాల‌ని, చిత్ర‌సీమ‌కు వెసులుబాటు క‌లిగించే అంశాల్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాల‌ని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ అటు వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా లేద‌ని స‌మాచారం. చిత్ర‌సీమ‌పై మొద‌ట్నుంచి జ‌గ‌న్ కినుక వ‌హిస్తున్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ఎన్నిక అయిన‌ప్పుడు చిత్ర‌సీమ‌కు చెందిన‌వాళ్లెవ‌రూ త‌న‌ని క‌లుసుకోలేద‌ని, అభినంద‌న‌లు చెప్ప‌లేద‌ని, స‌న్మాన కార్య‌క్ర‌మాలేవీ నిర్వ‌హించ‌లేద‌ని జ‌గ‌న్ ఫీల‌య్యార‌ని, అందుకే టాలీవుడ్ విష‌యంలో ఆయ‌న గుర్రుగా ఉన్నార‌ని వైకాపా అభిమానులు సైతం చెప్పుకుంటుంటారు. అదే కోపంతో.. ఏపీలో టికెట్ రేట్లు త‌గ్గించార‌ని, స‌వ‌రించిన టికెట్ రేట్ల విష‌యంలో టాలీవుడ్ కి సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఎన్ని అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చినా ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని, గ‌త కొన్ని రోజులుగా జ‌గ‌న్ అప్పాయింట్ కోసం టాలీవుడ్ పెద్ద‌లు ఎదుర చూస్తున్నార‌ని అయినా అటు నుంచి ఎలాంటి స్పంద‌నా లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close