మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి వచ్చింది. టీవీ9 యాంకర్ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరాటం ఉంది. వర్గాలు ఉన్నాయి. అయితే.. ఆఫీస్ పాలిటిక్స్ అన్ని చోట్లా ఉంటాయి.. కానీ టీవీ9లో మాత్రం గీత దాటిపోయాయి. ఎంత వరకూ అంటే.. కేసులు పెట్టుకునే వరకూ వెళ్లాయి. టీవీ9లోనే పని చేసే ప్రముఖ యాంకర్ ఒకరు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనం అయింది.

యాంకర్లు పూర్ణిమ, సుమతి, సుందర్‌ ముగ్గురూ కలిసి తమను వేధిస్తున్నారని.. అగే ఆఫీసులోనే పని చేసే మరో యాంకర్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు IPC 66, R/w 43, 84(B)ఐటి ఆక్ట్, R/w 511 కింద కేసు నమోదు చేశారు. పూర్ణిమ, సుమతి, సుందర్‌ ముగ్గరి పేర్లనూ ఫిర్యాదులో పేర్కొనడంతో వారందరిపైనా కేసులు పెట్టారు. కేసు పెట్టింది కూడా మహిళా యాంకరేనని తెలుస్తోంది. పూర్ణిమ, సుమతి కూడా ప్రముఖ యాంకర్లే.

ఏదో సందర్భంలో యువతి వద్ద ఫోన్‌ను వారు తీసుకున్నారు. తర్వాత ఇవ్వలేదని.. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పాటు బెదిరించారని ఫిర్యాదు దారు అయిన యువతి ఆరోపిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ఈ వివాదాన్ని బయటకు రాకుండా చేసి.. సంస్థ పరువు కాపాడాల్సిన పై స్థాయి వ్యక్తులు కూడా చూసీ చూడకుండా ఉండటంతో ఇప్పుడు సంస్థ పరువు సోషల్ మీడియాలో పోయే పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. అదంతా వారి వ్యక్తిగతమని ప్రకటించినప్పటికీ… జరిగాల్సిన నష్టం జరిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close