మాన్సాస్ ట్రస్ట్‌లో చైర్మన్ చెప్పినట్లే జరగాలి : హైకోర్టు

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం.. ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేయడంపై చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న సంస్థల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది.

మొత్తం ఈవో తానే సర్వాధికారినన్నట్లుగా వ్యవహరించడం … జీతాలు నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడటంతో.. అసలు ఈవో పాత్ర ఏమిటి? ఏం చేస్తారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌లో ఈవో తన ఆదేశాలను పాటించడం లేదని పేర్కొనడంతో.. ఈవో ఆదేశాలను పాటించాల్సిందేనని రూలింగ్ ఇచ్చారు. ఆడిటింగ్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని.. ఎవరెవరో వస్తున్నారని అశోక్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయి అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ్లాగే స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రాత్రికి రాత్రి ఆయనను పదవి నుంచి తొలగించి.. సంచైతను కూర్చోబెట్టారు. కోర్టు ఆమె నియామకాన్ని కొట్టేసిన తర్వాత కూడా.. అశోక్ గజపతిరాజు కు అడ్డంకులు సృష్టిస్తున్నారు. విచారణలు.. కేసులు.. అంటూ.. ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆడిటింగ్ పేరుతో అసలు జీతాలు ఇవ్వడమే మానేశారు. దాంతో ఉద్యోగులు ఆందోళన చేశారు. ఉద్యోగుల్ని రెచ్చగొట్టారంటూ అశోక్ పై కేసు కూడా పెట్టారు. అయినా అశోక్ గజపతిరాజు మాత్రం.. తన పోరాటం తాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోర్టును ఆశ్రయిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close