తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని

తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస‌, సంస్కృతి గ‌ట్టిగా ప్ర‌తిబింబిస్తోంది. ముఖ్యంగా యువ హీరోలెక్కువ‌మంది ఈ నేప‌థ్యాన్ని ఎంచుకుంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ హీరోనే కాబ‌ట్టి.. ఆ స్లాంగ్ భ‌లేగా పండిస్తుంటాడు. `ల‌వ్ స్టోరీ` కూడా తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో తెర‌కెక్కిన క‌థే. ఈ సినిమా కోసం నాగ‌చైత‌న్య తెలంగాణ యాస ని నేర్చుకున్నాడు. ఇప్పుడు నాని కూడా అదే బాట ప‌ట్టాడు. నాని క‌థానాయ‌కుడిగా సుధాక‌ర్ చెరుకూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌కాంత్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా కోసం నాని తొలిసారి తెలంగాణ యాస నేర్చుకుంటున్నాడ‌ట‌. తెలంగాణ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఓ తెలంగాణ అబ్బాయిగా నాని పాత్ర‌ని డిజైన్ చేశారు. కాబ‌ట్టి.. నానికి ఈ భాష‌లో ప‌ట్టుసాధించ‌డం అవ‌స‌రమైంది. అందుకోసం ఓ ట్యూట‌ర్ ని నియ‌మించుకున్నాడ‌ట‌. గ‌తంలో `కృష్ణార్జున యుద్ధం` కోసం రాయ‌ల‌సీమ యాస నేర్చుకున్నాడు నాని. నాని `ట‌క్ జ‌గ‌దీష్‌`, `శ్యామ్ సింగ‌రాయ్‌` షూటింగులు పూర్తి చేసుకున్నాయి. ప్ర‌స్తుతం `అంటే.. సుంద‌రానికి` సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు నాని. ఆ త‌ర‌వాత శ్రీ‌కాంత్ సినిమా మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close