టైమ్ మిష‌న్ ఎక్కుతున్న టాలీవుడ్‌

ఫార్ములా చుట్టూ టాలీవుడ్.. టాలీవుడ్ చుట్టూ ఫార్ములా తిరుగుతుంటుంది. ఓ ఫ్యాక్షన్ సినిమా హిట్ట‌యితే.. ఇంకోటి బ‌య‌ల్దేరిపోతోంది. హార‌ర్ సినిమాల‌న్నీ క‌ట్ట‌క‌ట్టుకుని వ‌స్తాయి. ల‌వ్ స్టోరీల‌న్నీ ఒకేసారి వ‌రుస క‌డ‌తాయి. ఇప్పుడు టైమ్ మిష‌న్ ల ట్రెండ్ మొద‌లైంది. ద‌ర్శ‌కులంతా ఇప్పుడు టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో క‌థ‌లు రాసుకుంటున్నారు.

టైమ్ మిష‌న్ అన‌గానే గుర్తొచ్చే సినిమా `ఆదిత్య 369`. నంద‌మూరి బాల‌కృష్ణ – సింగీతం శ్రీ‌నివాస‌రావు కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `ఆదిత్య 999` రెడీ అవుతోంది. ఈ చిత్రానికి బాల‌య్య క‌థ అందించ‌డం విశేషం. ఈ సినిమాతోనే మోక్ష‌జ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2023లో ఈ సినిమా ప‌ట్టాలెక్కొచ్చు. అన్నీ కుదిరితే బాల‌య్య‌నే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి `ప్రాజెక్ట్ కె` అనే నామ‌క‌ర‌ణం చేశారు. ఇదో విచిత్ర‌మైన జోన‌ర్‌. సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్ష‌న్.. ఇలా రెండు మూడు జోన‌ర్ల‌ని మిక్స్ చేశారు. ఇందులో టైమ్ మిష‌న్ కాన్సెప్ట్ కూడా ఉంద‌ట‌. అందుకే ఈ చిత్రానికి స్క్రిప్టు విష‌యంలో నాగ అశ్విన్ సింగీతం స‌హాయం కోరాడు. టైమ్ మిష‌న్ ఎక్కిన హీరో.. భ‌విష్య‌త్తులోకి వెళ్లిపోవ‌డమే ఈ క‌థ నేప‌థ్యం అని స‌మాచారం.

వీళ్ల‌తో పాటు శ‌ర్వానంద్ కూడా టైమ్ మిష‌న్ ఎక్కేస్తున్నాడు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు శ‌ర్వా ఓకే చెప్పాడు. ఇది టైమ్ మిష‌న్ క‌థే. టైమ్ మిష‌న్ లో శ‌ర్వా… త‌న బాల్యంలోకి వెళ్ల‌డమే ఈ క‌థా నేప‌థ్యం. 1990లోని అంద‌మైన జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకోవ‌డం ఈ క‌థ‌లోని పాయింట్. ఈ సినిమాలో టైమ్ మిష‌న్ లేవీ ఉండ‌వు గానీ.. అలాంటి విచిత్ర‌మైన సెట‌ప్ ఒక‌టి డిజైన్ చేస్తున్నారు. ఓ ర‌కంగా ఇది ఫాంట‌సీ సినిమా అనుకోవాలి. మొత్తానికి కాలాన్ని వెన‌క్కి తిప్పి గ‌తంలోకి…. ముందుకు జ‌రిపి భ‌విష్య‌త్తులోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కులు ఉత్సాహం చూపిస్తున్నారు. నిజంగా ఇది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శెట్టి బలిజల్ని తిట్టి సారి చెప్పిన జూపూడి !

వైసీపీ నేతలకు కులాలతో ఎలా ఆటలాడుకోవాలో బాగా  స్టడీ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కులాలను కించపర్చడం .. ఆ తర్వాత అబ్బే అదేమీ లేదనడం పరిపాటిగా మారింది. అమలాపురంలో...

రివ్యూ: ఎఫ్‌3

F3 Telugu Movie Review తెలుగు360 రేటింగ్ : 3/5 న‌వ్వించే సినిమాలు ఎప్పుడో కానీ రావు. మేం న‌వ్విస్తాం అంటూ సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లే క‌రువ‌య్యారు. హీరోలు కూడా ఆ...

కేసీఆర్ చెప్పే ఆ సంచలనం అన్నాహజారేనేనా !?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ ... తనచాయిస్‌గా అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్...

టీడీపీ నేతలకు సజ్జల ఎన్‌కౌంటర్ బెదిరింపులు !

వైసీపీలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించారా ? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయనను రెండున్నర నెలలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close