విద్యార్థులకు పథకం ఏదైనా “ల్యాప్ ట్యాప్” ఖాయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో కానీ ల్యాప్‌ట్యాప్‌ల మీద విపరీతమైన అభిమానం చూపిస్తోంది. అలాంటిలాంటి అభిమానం కాదు.. ఎంత వీలైతే అంత మంది భుజాలకు ల్యాప్‌ట్యాప్‌లు తగిలించాలని ప్లాన్ చేస్తోంది. అందు కోసం విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల లబ్దిదారులకు .. ల్యాప్ ట్యాప్ ఇస్తామన్న కబురు పంపుతోంది. అయితే ఉత్తినే కాదు.. పథకాల సొమ్ముకు బదులుగా ల్యాప్ ట్యాప్ ఇస్తామంటోంది. అమ్మఒడి పథకం కింద.. ప్రతీ ఏటా .. విద్యార్థుల తల్లికి రూ. పదిహేను వేలు ఇస్తున్నారు. అందులో వెయ్యి.. ఇతర ఖర్చులకు మినహాయించుకుని రూ. పధ్నాలుగు వేలు ఇస్తున్నారు. ఈ పథ్నాలుగు వేలకు బదులుగా ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏడాది కిందటే ప్రకటించారు.

దాని ప్రకారం.. వాలంటీర్లు… లబ్దిదారుల దగ్గర అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. చాలా మంది విద్యార్థుల తల్లులు తమకు వద్దని అనుకుంటున్నారు కానీ.. వాలంటీర్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ సర్కార్.. మరో పథకానికి ల్యాప్ ట్యాప్‌ను ముడి పెట్టేసింది. వసతి దీవెన కింద.. విద్యార్థులకు ఇచ్చే మొత్తానికి ల్యాప్ ట్యాప్‌లు తీసుకోవచ్చని పథకంలో ప్లాన్ మార్చింది. అయితే తప్పనిసరేమీ కాదు. వద్దనుకున్న వారికి నగదు ఇస్తారు. కానీ వద్దు అనేంత ధైర్యం లబ్దిదారులకు వాలంటీర్లను చూస్తే వస్తుందా అన్నది తర్వాతి విషయం.

అవసరం అయితే.. ఆ డబ్బులతో లబ్దిదారులే కొనుగోలు చేస్తారు.. ప్రభుత్వం ఎందుకు ల్యాప్‌ట్యాప్‌లు అంటగట్టాలనుకుంటుందో చాలా మందికి అర్థం కాని విషయం. చాలా ఎక్కున కన్ఫిగరేషన్ ఉన్నవి.. మంచి సర్వీస్ సపోర్ట్ ఉన్నవి.. అని ప్రభుత్వమే మార్కెటింగ్ చేస్తోంది. ల్యాప్ ట్యాప్‌కు ప్రాబ్లం వస్తే గ్రామ సచివాలాయాల్లో ఇస్తే చాలని.. రిపేర్ చేయిస్తారని కూడా అంటోంది. ల్యాప్ ట్యాప్ కంపెనీల కోసం అంత ఇదిగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏమిటో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ అమ్మఒడి, వసతి దీవెన లబ్దిదారుల్లో కనీసం సగం మందికైనా ల్యాప్‌ట్యాప్‌లు కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close