రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే ఉంది. తాము రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకున్నామని .. వెంటనే ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తాము రైతు స్నేహ‌పూర్వక రెవెన్యూ బిల్లును ప్రవేశ‌పెట్టామ‌ని కేటీఆర్ అన్నారు. కానీ కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లు విషయంలో సంబరాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. రైతులకు మేలు చేస్తే..వారు ఎందుకు సంతోషంగా లేరని ప్రశ్నించారు. ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయ‌ని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేటీఆర్ వాదనలో పస ఉంది. నిజంగానే…కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉపయోగడపేలా బిల్లులు తెచ్చినప్పుడు ..దానిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరిగేలా చూసుకోవాలి. అప్పుడే..అందులో ఉన్న మంచీ చెడ్డపై అందరికీఅవగాహన వస్తుంది. అయితే వ్యవసాయ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా వ్యవహరించింది. ఆ బిల్లు వల్ల రైతులకుఎలా లాభం కలుగుతుందో చెప్పలేకపోయారు. వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేయడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. కార్పొరేట్లకు దోచి పెడతారన్న చర్చ కూడా నడుస్తోంది. అలాగే మద్దతు ధర ఇవ్వరని కూడా చెబుతూ వస్తున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండా..రైతులు ఇక ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రైతులు ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. కొత్తగా ఇచ్చేదేమీలేదు.

కానీ రైతులు ఎక్కడకు తీసుకెళ్లి అమ్ముకుంటారు..?. కొత్తగా రీటైల్ బిజినెస్‌లు పెట్టుకునే కార్పొరేట్లకే అమ్ముకోవాలి. తెలంగాణ సర్కార్ రెవిన్యూ విషయంలో రెండేళ్ల నుంచి చర్చ ప్రజల్లో జరిగేలా చేసింది. అలా చేసి.. వారి ఇబ్బందుల్ని గుర్తించి.. పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఇబ్బందులు తొలగుతాయనే భావనను కొత్త బిల్లు ద్వారా తెచ్చారు. అందుకే ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత రాలేదు. ఆ ఉద్దేశంతోనే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close