డ్రగ్స్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్ !

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసే చేశారు కానీ ఎక్కడా ఆయన పేరు చెప్పలేదు. అయితే శనివారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి తనపైనే విమర్శలు చేస్తున్నారని ఫిక్సయి.. డ్రగ్స్ టెస్టుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎవడో పిచ్చోడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి లేఖ ఇచ్చాడని మండిపడ్డారు. తనకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలంటే బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, అవసరమైన ఇతర శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధమేనని స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అందుకు సిద్ధపడాలని చాలెంజ్ చేశారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నారు. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి.. ఇవ్వాళ కన్నాలు వేస్తున్నారని రేవంత్ రెడ్డిపై సెటైర్ వేశారు.

అదే సమయంలో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి గాడిద అనడంపైనా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తుచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త్రివిక్రమ్ రాసిన సీన్ లో నేను నటించడం మర్చిపోలేను: నాగశౌర్యతో ఇంటర్వ్యూ

నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది....
video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

HOT NEWS

[X] Close
[X] Close