కేటీఆర్, హరీష్ రావులది అన్నదమ్ముల అనుబంధమట..!

తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా ఎడమెహం, పెడమొహంగా ఉంటున్న నేతలు… కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్ లీడ్ తీసుకోక ముందు… టీఆర్ఎస్ మొత్తం హరీష్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు హరీష్ .. ఓ మంత్రి మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ ప్రభుత్వంలో… ఓ చిట్టచివరి మంత్రి. ఆయనకు ఎలాంటి బాధ్యతలు పార్టీ పరంగా అప్పజెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రగతి భవన్‌లోకి కూడా ప్రవేశం … కేసీఆర్ పిలిచినప్పుడే లభిస్తోంది. హరీష్‌పై అంత అనుమానం.. కేసీఆర్‌కు ఎందుకు వచ్చిందో కానీ… క్యాడర్‌లో మాత్రం గందరగోళం ఏర్పడింది. హరీష్ తో వ్యవహారాలు నడిపిన నేతలు.. ఒక్కొక్కరు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోుతన్నారు. దీంతో.. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనుకున్నారేమో కానీ… ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు.

సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేతలను.. హైదరాబాద్ పిలిపించిన కేసీఆర్.. దానికి హరీష్ రావును కూడా ఆహ్వానించారు. హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు పోతున్నాయని ఆయన తెలిపారు. 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గత నాలుగేళ్లలో నే మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. హరీష్ రావు , తాను అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని గుర్తు చేసుకున్నారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరిగెత్తిస్తున్నారన్నారని పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

మొత్తానికి హరీష్ రావు.. వ్యవహారం.. టీఆర్ఎస్ లో కలకలంలానే మారింది. టీఆర్ఎస్ సొంత మీడియాలో… హరీష్ రావుకు సంబంధించిన వార్తలను కొంత కాలం నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు. నేరుగా పొమ్మనలేక.. పొగ పెడుతున్నారన్న ప్రచారాన్ని ప్రారంభించారు. హరీష్ ఎప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోతారా అని… ప్రగతి పెద్దలు ఎదురు చూశారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు నేరుగా.. కేటీఆర్, హరీష్ కలిసి మాట్లాడటంతో… ఈ ఎపిసోడ్ మరికొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close