అరవింద కోసం… జైస‌ల్మీర్‌లో డ‌బ్బింగ్!

త్రివిక్రమ్ అండ్ టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. అక్టోబర్ 11న ‘అరవింద సమేత వీరరాఘవ’ను విడుదల చేస్తామని ప్రకటించేశారు. అందుకని హడావుడి తప్పడం లేదు. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డే డబ్బింగ్ విషయంలో త్రివిక్రమ్ టీమ్ కష్టపడక తప్పలేదు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో పాటు హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌-4’లో ఆమె నటిస్తున్నారు. రాజ‌స్తాన్‌లోని జైస‌ల్మీర్‌లో హిందీ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందువల్ల, ‘అరవింద…’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేదు. అదేమీ పెద్ద సమస్య కాదు. కాని తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయకపోతే సమస్యే. ఓ పక్క హిందీ సినిమా షూటింగ్… మరో పక్క తెలుగు సినిమా డబ్బింగ్… ఏం చేయాలో అని ఆలోచించి ఆలోచించి త్రివిక్రమ్ టీమ్‌ని జైస‌ల్మీర్‌లోని త‌న హోట‌ల్ రూమ్‌లో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయమని అడిగారు. విడుదల తేదీ దగ్గర పడటంతో అలాగే ఏర్పాటు చేశారు. దాంతో పగలు ‘హౌస్‌ఫుల్‌-4’ షూటింగ్ చేసి, రాత్రి వేళల్లో ‘అరవింద..’కు డబ్బింగ్ చెప్పానని పూజా హెగ్డే తెలిపారు. తెలుగులో తన పాత్రకు పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే తొలిసారి. బహుశా… ఓ తెలుగు సినిమా కోసం జైస‌ల్మీర్‌లో హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం కూడా ఇదే తొలిసారి అయ్యుండొచ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close