రెబెల్స్ మీద వేటు వెయ్యకపోవడం వెనక కేటీఆర్ వ్యూహం ఇదా..?

వీలైతే నచ్చజెప్పండి, వినకుంటే సస్పెండ్ చేయండి, భవిష్యత్తులో తెరాసలోకి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదనీ చెప్పండి…. ఇదీ రెబెల్స్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు. మున్సిపల్ ఎన్నికలకు మూడురోజులే సమయం ఉంది. రెబెల్స్ అలానే ఉన్నారు. చాలా చోట్ల రెబెల్స్ కి తెరాసకి చెందిన కొందరు సీనియర్లే మద్దతుగా నిలుస్తున్నట్టు కథనాలున్నాయి. అయినా ఇంతవరకూ ఎవ్వరినీ ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించలేదు..? క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోలేదు..? దీని వెనక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వ్యూహం ఏదైనా ఉందా… అంటే, ఉందనే అనిపిస్తోంది.

రెబెల్స్ విషయంలో కేటీఆర్ ద్రుష్టికి చాలా ఫిర్యాదులే వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు వంద మంది రెబెల్ అభ్యర్థుల వెనక జూపల్లి క్రిష్ణారావు ఉన్నారనీ, తాండూరు మున్సిపాలిటీలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా రెబెల్స్ కి కొమ్ము కాస్తున్నారనీ, మహేశ్వరం పరిధిలో మాజీ మంత్రి తీగల క్రిష్ణారెడ్డి కూడా పరోక్షంగా కొంతమంది అభ్యర్థులకు సాయం అందిస్తున్నారనీ, చౌటుప్పల్ లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వర్గానికి మద్దతు ఇస్తున్నారనీ… చాలా ఫిర్యాదులు కేటీఆర్ ద్రుష్టికి వెళ్లాయి. ఈ నాయకులందరితోనూ బుజ్జగింపు ప్రయత్నాలు మాత్రమే కేటీఆర్ చేశారు. ఒకసారి చెప్పి వదిలేశారు. అంతేగానీ, ఎవ్వరితోనూ మరీ కఠినంగా వ్యవహరించలేదు. పార్టీ ఆదేశాలను పాటించకపోయినా మౌనంగానే చూస్తున్నారు.

రెబెల్స్ విషయంలో కేటీఆర్ ఇలా వ్యవహరించడం వ్యూహత్మకమే అని చెప్పాలి. ఎలా అంటే… రెబెల్స్ గా బరిలోకి దిగినవారిలో కొందరైనా గెలుస్తారు కదా. వాళ్లు చివరికి తెరాసకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకోవడం అనేది కేటీఆర్ వ్యూహం కావొచ్చు. వేటు వేయడాలు లాంటివి చేస్తే… గెలిచే ఆ కొంతమంది కూడా ఆ తరువాత తెరాసకు వ్యతిరేకులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, వేటు దాకా వెళ్లకుండా… ఓసారి నచ్చజెప్పి, మౌనంగా ఉండిపోతే వాళ్లే చివరికి తిరిగి రావొచ్చు కదా. ఇప్పుడీ రెబెల్స్ కి మద్దతు ఇస్తున్న సొంత పార్టీ నేతలకి కూడా తెరాస మీద విముఖతేం లేదు కదా. స్థానికంగా తమ ప్రాధాన్యత పెంచుకోవాలని చూస్తున్నారు. తెరాసలో ఉంటూనే దాన్ని సాధించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి, వేటుగీటూ లాంటివి తరువాతి పరిస్థితుల్ని మరింత జఠిలం చేస్తాయి. ఆ ముందుచూపుతోనే తెరాస నాయకత్వం వ్యవహరిస్తోందని భావించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close