బయట ముట్టడి – లోపల కట్టడి..!

రాజధాని మార్పు నిర్ణయాన్ని ఆపడానికి చేయాల్సిందంతా చేయాలని.. తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. చంద్రబాబునాయుడు దూకుడుగా ఉన్నారు. ఆయన 20వ తేదీన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమాలు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముట్టడి పిలుపు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో.. అసెంబ్లీ, శాసనమండలిలో పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో.. టీడీపీ ఉంది. రాజధాని తరలింపు అంశాన్ని నేరుగా బిల్లులో పెట్టకుండా పని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి విరుగుడు వ్యూహంపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. న్యాయనిపుణుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. మండలిలో బిల్లును తిరస్కరించటం లేదా రెండు, మూడ్రోజులపాటు చర్చ నిర్వహించాలని పట్టుబట్టడం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విధంగా తీర్మానం చేయటం వంటి మార్గాలను రెడీ చేసుకుంటున్నారు.

అసెంబ్లీ వేదికగా వాదన వినిపించేందుకు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పాగోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. బిల్లు ఏ రూపంలో ప్రభుత్వం తీసుకు వస్తుందనేది.. ఆసక్తికర అంశంగా మారింది. కౌన్సిల్‌లో ఏ రూపంలో వచ్చినా బిల్లుపై అప్పటికప్పుడు వ్యూహం రూపొందించుకునే బాధ్యతలను యనమల రామకృష్ణుడుకు అప్పగించారు. అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటంతో కౌన్సిల్ లో ఆయన ప్రభుత్వ వ్యూహాల్ని తిప్పికొడతారని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ తరపు నుంచి చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని, ఇందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు శాసనసభాపక్ష సమావేశంలో వ్యూహాలను ఖరారు చేయనున్నారు. అదే విధంగా అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువైనప్పటికీ, గళం వినిపించడంలో దీటుగా ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. బయట అసెంబ్లీ ముట్టడి.. లోపల అధికార పక్షాన్ని కట్టడి చేసి.. అమరావతి నిర్ణయంపై ముందుకెళ్లకుండా చేయాలని టీడీపీ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

ఆర్ఆర్ఆర్ మరో లేఖ : భవన నిర్మాణ కూలీలకు సాయం ఏదీ..?

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పేరుతో.. వారికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రూ. 1364 కోట్లు వసూలు చేసిందని... అయినా ఈ సంక్షోభ సమయంలో.. వారిని ఎందుకు ఆదుకోవడం లేదని.. నర్సాపురం ఎంపీ...

HOT NEWS

[X] Close
[X] Close