ఏపీ ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిది? వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ఆన్స‌ర్

ఏపీ ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిది? ర‌క‌ర‌కాల సంస్థ‌లు, స‌ర్వే ఏజేన్సీలు నిత్యం ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టేందుకు చెమ‌ట్చోడుతున్నాయి. పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వేలు ఇచ్చే సంస్థ‌లు కొన్ని అయితే, నిజంగానే ప్ర‌జ‌ల ప‌ల్స్ ను ప‌ట్టుకునే సంస్థ‌లు కూడా ఉన్నాయి.

అయితే, ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపుపై తాజాగా కేటీఆర్ ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో ఏపీలో ఎవ‌రు గెలుస్తారు అన్న అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ కేసీఆర్ కామెంట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. దీంతో కేటీఆర్ అంచ‌నా ఎలా ఉంటుంద‌న్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రికీ ఉంటుంది.

కేసీఆర్ ఫ్యామిలీకి జ‌గ‌న్ కు మంచి సంబంధాలున్నాయ‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. దీంతో కేటీఆర్ కూడా జ‌గ‌న్ కు ఓటేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ, కేటీఆర్ ట్విస్ట్ ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న జ‌గ‌న్ త‌న‌కు అన్న‌లాంటి వార‌ని, ఇటు లోకేష్ కూడా స్నేహితుడ‌ని కామెంట్ చేశారు. చంద్ర‌బాబు పెద్ద‌వార‌ని, ప‌వ‌న్ త‌న‌కు బ్ర‌ద‌ర్ తో స‌మానం అంటూ ఏ ఒక్క‌రికీ మ‌ద్ద‌తుగా ఏదీ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఎవ‌రూ గెలిచినా ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని మాత్రం కోరుకుంటున్న‌ట్లు న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు.

గ‌తంలో చంద్ర‌బాబు అరెస్ట్ స‌మ‌యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయి. దీంతో ఈసారి ఎలాంటి త‌ప్పుకు తావివ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే కేటీఆర్ స‌మాధానం దాట‌వేసినట్లు క‌న‌ప‌డుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close