నెట్ ఫ్లిక్స్ చేతిలో ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’

రామ్ కెరీర్‌లోనే పెద్ద హిట్ గా నిలిచింది ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. పూరికి కూడా ఇది మంచి క‌మ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి సీక్వెల్ చేస్తున్నారు. అదే ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’. ఈ సినిమా మార్చిలోనే విడుద‌ల కావాల్సింది. కానీ.. ఆల‌స్య‌మైంది. ఇప్పుడు జూన్‌కి వెళ్లింది. అయితే జూన్‌లో కూడా రావ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే ఎన్నిక‌ల సీజ‌న్ వ‌ల్ల‌, సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. పెద్ద పెద్ద సినిమాల‌న్నీ జూన్‌లోనే వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’కి స‌రైన డేట్ దొర‌క్క‌పోవొచ్చు. జూలైలో ఈ సినిమా విడుద‌ల కావొచ్చు.

‘డ‌బుల్ ఇస్మార్ట్’ ఓటీటీ హ‌క్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ చేజిక్కించుకొంది. రామ్ కెరీర్‌లోనే మంచి రేటు ప‌లికిన సినిమా ఇది. దాదాపు 90 శాతం టాకీ పూర్త‌య్యింది. కొన్ని సన్నివేశాల‌తో పాటు, 3 పాట‌ల్ని తెర‌కెక్కించాలి. ప్ర‌స్తుతం మ‌ణిశ‌ర్మ మిగిలిన 3 పాట‌ల‌కు సంబంధించిన బాణీల్నీ అందించే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. ట్యూన్స్ రాగానే పాట‌ల చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు. జులై లో కాబ‌ట్టి.. రిలీజ్‌కు మంచి టైమ్ ఉన్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close