చైతన్య : మనం చేసినప్పుడు జోకులు – మనకు జరిగినప్పుడు నీతులు చెప్పకూడదు కేటీఆర్ !

మనం బాగున్నప్పుడు జోకులు… మనకు బాగోలేనప్పుడు నీతులు చెప్పడం అనేది మానవుల సహజ లక్షణం. అందులో తప్పేం లేదు. కానీ మనమే అడ్డగోలు పనులు చేసి.. దాని వల్ల బాధితులైన వారి బాధలు చూసి వికటాట్టహాసాలు చేసి.. ఇప్పుడు అలాంటి వ్యవహారాల వల్ల తానే బాధితులుగా మారి… తన వల్ల బాధలు పడిన వారినే సపోర్టుగా ఉండాలని కోరడం మాత్రం విచిత్రమే. కేటీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఐదేళ్ల కిందట చంద్రబాబు చేసిన ట్వీట్ ను.. రీట్వీట్ చేశారు. రాహుల్ గాందీ అన్న మాటల్ని కూడా తన వాల్ మీదకు తెచ్చుకున్నారు. ఇవన్నీ కేటీఆర్ గతంలో చేసిన వ్యవహారాల్నే గుర్తుకు తెస్తున్నాయి.

పదేళ్లలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేటీఆర్ చేసిందేంటో ?

కేసీఆర్ లేదా కేటీఆర్ లేకపోతే కవిత ఎవరూ అనామకులు కాదు. పదేళ్ల పాటు తెలంగాణలో సర్వాధికారాల్ని గుప్పిట పట్టుకున్న వారు. పోలీసు వ్యవస్థను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నవారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి ఎంత చేయాలో అంతా చేశారు. చివరికి తమ రాజకీయాలు కాదు.. పక్క రాష్ట్ర రకాజకీయాల కోసమూ తమ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన గొప్ప చరిత్ర ఉంది. 2019 లో.. డేటా చోరీ పేరు టీడీపీకి చెందిన యాప్ నిర్వహించి ఐటీ ఆఫీసుపై దాడి చేసి.. మొత్తం సమాచరం దొంగిలించి వైసీపీకి అందించిన చరిత్ర ఎవరిది ?. సజ్జనార్, అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్రతో ఆడిచిన ఆట ఎంత ప్రమాదకరమైనది ?. అసలు ఏపీలో డేటాచోరీ పేరుతో రాజకీయం చేయడమేంది.. తెలంగాణ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఏంది ?. ఇది మచ్చకు ఒక్కటే.. లెక్కలేనంత దుర్వినియోగం చేసి.. ఎంత మంది జీవితాల్ని నాశనం చేశారో చెప్పాల్సిన పని లేదు. బయటకు తెలిసిన దాని కంటే.. కేటీఆర్‌కు తెలిసిందే ఎక్కువ.

ఫోన్ ట్యాపింగ్‌లతో మాఫియా రాజ్ నడపింది బయటపడటం లేదా ?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఆ పేరుతో ఓ ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేశారు. ఆ రికార్డుల్ని బయటకు వదిలారు కూడా. అంతేనా.. పదేళ్ల పాటు ఆ ట్యాపింగ్ తో ఎంత మంది జీవితాలతో ఆడుకున్నారో .. మీకే తెలుసు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఎలా చేరారో కూడా ట్యాపింగ్ మహిమలకే తెలియాలి. ఇవన్నీ చేసినవి చిన్నవి కాదు. అధికార దుర్వినియోగంతో చట్ట పరిధి దాటి మరీ చేసిన పనులు. అన్నింటికీ బాధితులు ఉన్నారు.

బాధితులయ్యాక నీతులు ప్రవరించడం కాస్త ఎబ్బెట్టే !

నడిచినంత కాలం నడిచింది. ఇప్పుడు బాధితులుగా మారుతున్నారు. అందుకే మీకు నీతులు.. గుర్తుకొస్తున్నాయి. రావొచ్చు..అది మానవుల సహజ లక్షణం.. కానీ మీరు బాధితులుగా మార్చిన వ్యక్తుల్నే మద్దతు అడగడం మాత్రం… కేటీఆర్ కు మాత్రమే ప్రత్యేకం అని అనుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేయకుండా.., వాటితో రాజకీయ అవసరాలు తీర్చుకోకుండా ఉన్నట్లయితే.. ఇక్కడ ప్రజలకు కొంత అయినా మీ మీద సానుభూతి ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలకు అదేమీ కనిపించడం లేదు.

వ్యవస్థో రక్షిత.. రక్షిత: అన్నది ఇందుకే !

కవిత అరెస్ట్ కరెక్టా కాదా అన్నది మన అభిప్రాయాలు మనం చెప్పవచ్చు..కానీ దేశంలో గత పదేళ్లుగా వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయన్నది మాత్రం అందరూ గగ్గోలు పెడుతున్న మాట. వ్యవస్థో రక్షిత రక్షిత: అన్నారు పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్ని చెరబట్టి.. అధికారం పోయాక అవే రక్షించాలంటే సాధ్యం కాదు. ఈ తప్పులో కేటీఆర్ కూ భాగం ఉంది. ఆ తప్పుల వల్ల కేటీఆర్ ఫ్యామిలీకే మాత్రమే కాదు.. మొత్తం ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతోంది. కేటీఆర్ ఇప్పుడు ఎంత గింజుకున్నా ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close