Sree vishnu movie om bheem Bush trailer released
కామెడీ కథలకు ఎప్పుడూ తిరుగుండదు. కాస్త నవ్విస్తే చాలు. కాసులు కురుస్తాయ్! ‘సామజవరగమన’తో కామెడీ మహత్మ్యం మరోసారి శ్రీవిష్ణుకి తెలిసొచ్చింది. ఇప్పుడు మరో ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే ‘ఓం భీం భుష్’. ఈసారి శ్రీవిష్ణుకి తోడుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నాడు. కాబట్టి ఇది ట్రిపుల్ ట్రీట్ అనుకోవాలి. హుషారుతో ఆకట్టుకొన్న హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 22న వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది.
దాదాపు 2 నిమిషాల ట్రైలర్ ఇది. నాన్ స్టాప్‌గా నవ్వులు పంచుతూనే ఉంది. ముగ్గురు స్నేహితుల కథ ఇది. వాళ్ల తింగరితనం, అమాయకత్వం, అడ్వైంచరస్ నుంచి పండే వినోదమే కథ. ఈ ట్రైలర్‌తో కథేం చెప్పలేకపోయినా.. తెరపై ఎలాంటి తతంగం జరుగుతుందో రుచి చూపించారు. భైరవపురం, అక్కడి సంపంగి మహల్ లో నిధి రహస్యం.. దాని చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. సంభాషణలు ట్రెండీగా ఉన్నాయ్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ఱ మధ్య పుట్టే కెమిస్ట్రీనే ఈ సినిమాకు ప్రాణం. ముగ్గురూ తమ ఈజ్ చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ‘జాతి రత్నాలు’ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సినిమా కూడా అదే స్థాయిలో ఆడితే.. శ్రీవిష్ణుకు మరో హిట్ దక్కినట్టే. ఈ సమ్మర్లో వినోదాల విందు పంచడానికి ‘ఓం భీం భుష్’ సిద్ధంగా ఉంది. మరి ఈ కామెడీ డిష్‌ని ఏ మేరకు ఆస్వాదిస్తారో చూడాలి.
Let us wait till date