సీఎం రేవంత్ రెడ్డి చర్చకు ఎప్పుడు సవాల్ విసిరినా కేసీఆర్ కే విసురుతున్నారు.. కేటీఆర్ ను ఆయన అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ, కేటీఆర్ మాత్రం రేవంత్ కు కేసీఆర్ అక్కర్లేదు.. నేను వస్తా అంటూ పదేపదే డైలాగ్ లు వినిపిస్తున్నారు.. దీన్ని రేవంత్ మాత్రం ఖాతరు చేయడం లేదు. కేసీఆర్ తో మాత్రమే చర్చకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల రైతు సమస్యలపై కూడా రేవంత్ విసిరిన సవాల్ కు కేసీఆర్ ఎప్పటిలాగే స్పందించలేదు. కేటీఆర్ మాత్రం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ను చర్చకు వేదికగా నిలిపారు. రేవంత్ రావాలన్నారు.. ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ కూడా కేటాయించారు. కానీ, రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
రేవంత్ … కేసీఆర్ కు సవాల్ విసిరినప్పుడల్లా తాను వస్తానంటూ మాట్లాడుతున్నారు కేటీఆర్. రేవంత్ కు నా స్థాయి లీడర్ సరిపోతారని చెప్పేస్తున్నారు. రేవంత్ ను అభ్యంతరకరమైన రీతిలో దూషిస్తూ ఆయనది నా స్థాయే అంటూ కేటీఆర్ చెప్పుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అదే సమయంలో పదేపదే రేవంత్ సవాల్ కు కేటీఆర్ ప్రతిస్పందించడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ రేవంత్ పేరును ఎత్తెందుకు కూడా ఇష్టపడేవారు కాదు. రేవంత్ సీఎం అయ్యాక నిత్యం కేటీఆర్ ఆయన జపం చేస్తున్నారు. ఆయన సవాల్ కు పోటీపడి స్పందిస్తున్నారు.
కేటీఆర్ అదేపనిగా స్పందించడం వెనక బలమైన రీజన్ ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఐడెంటి క్రైసిస్ లో ఉన్నారని, అందుకే రేవంత్ సవాళ్లకు స్పందిస్తున్నారనే కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం సవాల్ విసిరింది కేసీఆర్ కు అయితే… కేటీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇందుకు కారణం ఆయన ఐడెంటి క్రైసిస్ తో బాధపడటమే అని అంటున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మినహా మరెవరి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయనని స్వయంగా ఆయన సొంత చెల్లి చేసిన కామెంట్స్ ను కూడా కాంగ్రెస్ నేతలు ఉదాహరిస్తున్నారు. ఫ్యామిలీలో కేసీఆర్ తదుపరి నాయకత్వం ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుందని అందుకే కేటీఆర్ పోటీపడి రేవంత్ వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు.