రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలతో కేటీఆర్ ను అరెస్టు చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అనవసరంగా ఆయనను అరెస్టు చేసి సానుభూతి తెప్పించడం ఎందుకన్న కారణంగా అరెస్టు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు. ఈ అంశాన్ని కేటీఆర్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి తనను అరెస్టు చేసే దమ్ము లేదంటున్నారు. ఎందుకు లేదంటే ఆ కేసులో పస లేదని.. లొట్టపీసు కేసని ఆయనకూ తెలుసని కేటీఆర్ అంటున్నారు.
కేటీఆర్ అరెస్టు కు రెడీ అని ఇలా ప్రకటన చేయడం వెనుక ఉన్నది ధైర్యం కాదని.. రివర్స్ గేమ్ అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అరెస్టు భయంతోనే ఆయన ..కమాన్ అరెస్ట్ మీ అంటున్నారు కానీ.. అరెస్టు చేస్తే ఎలా అని ఆయన కంగారు పడుతున్నారని ..భయపడుతున్నారని చెబుతున్నాయి. అందుకే ఆయన ప్రతీ క్షణం అరెస్టు గురించి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. అరెస్టు చేయకుండా ఉండకపోవడం అనేది ఉండదని..ఎంత పక్కాగా బుక్ చేస్తే అన్ని ఎక్కువ రోజులు లోపల ఉంటారన్నదే రేవంత్ ప్లాన్ అని చెబుతున్నారు.
అదే సమయంలో రాజకీయ పరంగా అరెస్టు చేసినట్లుగా ఉండకుండా ఆయన తప్పు చేశారు కాబట్టి న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకుని ఆయన ఇక అరెస్టు కాక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే అరెస్టు చేస్తారని అంటున్నారు. అప్పుడు కేటీఆర్ కు వచ్చే మైలేజీ కూడా రాదని.. అలాంటి టైమ్ కోసం ఎదురు చూడాలని కేటీఆర్కు సలహాలిస్తున్నారు.