తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ కు ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. కానీ దేశస్థాయిలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఆ లెక్కన బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షమే. అందరూ కలిసి అధికార పార్టీని నిలదీయాలి. కానీ కేటీఆర్ మాత్రం.. మోదీ పాలనపై కక్ష మాట మాట్లాటడం లేదు కానీ విపక్ష నేత రాహుల్ ను మాత్రం విమర్శిస్తున్నారు.
జాతీయ స్థాయిలో తన అభిప్రాయాలు చెప్పాల్సి వస్తే బీజేపీని మెప్పించేందుకు కాంగ్రెస్ ను, రాహుల్ ను నిందిస్తున్నారు. చెన్నైలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ విజన్ లేదని నిందించారు. రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ఏనాడు చూడలేదని అనేషాకు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం మెడలో గుదిబండ రాహుల్ గాంధీ అని నిందించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ తెలంగాణ గురించి..తమ పాలన గొప్పతనం గురించి.. కాంగ్రెస్ పార్టీ చేతకాని తనం గురించి.. రాహుల్ అసమర్థత గురించి చెప్పారు. కానీ అసలు మిస్ అయింది మాత్రం.. కేంద్రంలో పాలన గురించి మాత్రం మాట్లాడలేదు. కానీ బీజేపీ వారసత్వ రాజకీయాలను వద్దంటోందని కానీ కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోందని విమర్శించారు.
కేటీఆర్, కేసీఆర్ మోదీని పాలనా పరంగా పల్లెత్తు మాట అనడం లేదు. రాజకీయంగా సుతిమెత్తగా విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో.. కాంగ్రెస్ పై దండయాత్ర చేస్తున్నారు. రాహుల్ పనికి మాలిన నేత అని చెప్పి.. మళ్లీ ఆయనకే లేఖలు రాస్తూంటారు. బీజేపీ పొగడలేక.. కాంగ్రెస్ ను తిడుతున్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.