రాజీనామా డిమాండ్లను సీరియస్‌గా తీసుకుంటున్న కేటీఆర్ !

పేపర్ల లీకేజీ విషయంలో విపక్ష పార్టీలన్నీ తనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూండటంతో కేటీఆర్ అసహనానికి గురవుతున్నారు. విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనంలోనూ ఇదే గుర్తు చేసుకున్నారు. పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ మాట్లాడుతున్నాడని, మరి గుజరాత్ రాష్ట్రంలో
గత ఎనిమిదేళ్లలో 13 పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడి ముఖ్యమంత్రి రాజీనామా చేశాడా ? అని ప్రశ్నించారు.

గ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పీఏ పేపర్ లీక్ చేశాడని ఆయన స్వగ్రామంలో వంద మందికి వంద మార్కులకు పైగా వచ్చాయని పిచ్చి కూతలు కూస్తున్నాడన్నారు. మల్యాల మండలం మొత్తంలో 35 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కరికి మాత్రమే వంద మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయని, సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదన్నారు. ఇది చాలదా పేపర్ లీకేజ్ తో తమకు సంబంధం లేదని తెలిపేందుకు కేటీఆర్ తన తప్పేం లేదని వివరణ ఇచ్చారు.

నిజానికి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తూంటాయి. అధికారంలో ఉన్న వారిపై ఒకటికి పది వస్తూంటాయి. సీరియస్‌గా తీసుకుంటే అలాంటివి ఇంకా ఎక్కువ చేస్తారు. సీరియస్‌గా తీసుకోకపోతే.. జనం నమ్ముతారేమో అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని కేటీఆర్ ఎదుర్కొంటున్నారు . అప్పటికీ రాజకీయ ఆరోపణలను సిట్ తో సమాధానం ఇప్పించడానికి ప్రయత్నించారు. వారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయని చెప్పించే ప్రయత్నం చేశారు. అది వివాదాస్పదం అయింది. అయినా ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. కేటీఆర్ మాత్రం వాటిపై వివరణ ఇస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close