పోలవరం ఎత్తు లోక్‌సభకు..రాజ్యసభకు వేర్వేరు !

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలు ఆడుతోంది. క్లారిటీ లేకుండా విరుద్ధమైన సమాధానాలు చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు గత నాలుగేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. డబ్బులు రీఎంబర్స్ చేయాల్సిన పని లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పోలవరం ఎత్తుపైనా దాగుడుమూతల సమాధానాలు చెబుతున్నారు.

నాలుగు రోజుల కిందట వైసీపీ ఎంపీ సత్యవతి పోల‌వ‌రం ఎత్తుపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పారు.. ప్ర‌క‌ట‌న వ‌చ్చి నాలుగు రోజులు గ‌డ‌వ‌క ముందే పోలవరం పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. తాజాగా నేడు రాజ్యసభలో ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పురోగతిపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర పోల‌వ‌రం ఎత్తుపై ప్ర‌శ్న వేశారు..

దీనికి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ, 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని ఆ మేర‌కే నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు.. నీటి నిల్వ సామర్ధ్యం 41.15 కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ దగ్గరే నీటి నిల్వ చేస్తామని ప్రకటించారు. అయితే అటువంటి ప్ర‌తిపాద‌న ఏదీ ఎపి ప్ర‌భుత్వ నుంచి త‌మ‌కు అంద‌లేద‌ని మంత్రి తుడు తేల్చి చెప్పారు..

ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రాష్ట్రం అటు కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టిన పనులు ఇప్పుడు పడకేశాయి. ఎంత ఆలస్యం అయితే.. అంత ఖర్చు పెరుగుతుందని తెలిసినా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి. అది ఏపీకి శాపంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close