కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ రాజీనామాల సవాళ్లు !

బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మళ్లీ పొలిటికల్ ఫీల్డులోకి వస్తున్నారు. సవాళ్లకు సవాళ్లు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల విషయంపై కేటీఆర్, బండి సంజయ్ రాజీనామాలకు సిద్ధమా అని సవాళ్లు చేసుకున్నారు. తెలంగాణకు కేంద్రమే అన్నీ నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెబుతున్నారు. కాదు తెలంగాణనే కేంద్రానికి నిధులిస్తోందని కేటీఆర్ అంటున్ారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఇది నిజం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.

నిజం అయితే  బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు.  మెదక్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ సవాల్‌పై స్పందించారు. కేటీఆర్ తుపాకీ రాముడని మండిపడ్డారు. సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదని దమ్ముంటే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమని సవాల్ చేయాలని తాను సిద్ధమని ప్రకటించారు.  ప్రజలు చెల్లించే పన్నుల్లో కొంత రాష్ట్రానికి, కొంత కేంద్రానికి వెళ్తాయి. కేంద్రానికి వెళ్లే పన్నులు మళ్లీ రాష్ట్రాలకే కేటాయిస్తారు.  

కేంద్రం అలా ఇచ్చే నిధుల్నే బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటూండటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఇది సవాళ్లకు దారి తీసింది. సహజంగా ఇలాంటి సవాళ్లన్నీ రాజకీయంగానే ఉండిపోతాయి. లెక్కలు బయట పెట్టేందుకు రెండు వర్గాలూ సిద్దం కావు. కేటీఆర్, బండి సంజయ్ సవాళ్లు కూడా నిజాలు బయటకు రావడానికి కావు.. కేవలం రాజకీయం చేసుకోవడానికే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close