జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ! ప్రభుత్వాల గేమ్ ?

పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వ్యూహాత్మకంగా ప్రచారం ప్రారంభించారు. 17వ తేదీన జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. అక్కడ నిర్ణయం తీసుకుంటామని లీకులు ఇస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పిండుకుంటోంది.. ప్రధాన ఆదాయన వనరుగా మార్చుకుంది ఈ పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల మీదనే. అందుకే జీఎస్టీలోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్లు ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి పన్ను తగ్గిస్తేనే రూ. 15వేల కోట్లు నష్టపోతామంటూ గతంలో మంత్రులే సాధ్యం కాదని తేల్చారు.

పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం ప్రజల్ని కుదురుగా ఉండనీయడం లేదు. ఫలితంగా ప్రభుత్వాలకూ సెగ తగులుతోంది.కానీ పన్నులు తగ్గించలేరు. అయితే మభ్య పెట్టాలి కాబట్టి అప్పుడప్పుడు పెట్రోల్, డిజిల్ ధరలను జీఎస్టీలోకి చేర్చే కసరత్తు జరుగుతోందని ప్రకటనలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు 80శాతం పైనే పన్నులు విధిస్తున్నాయి. దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వాలు ఆదాయం కోల్పోతాయి. అందుకే మెజార్టీ రాష్ట్రాలు తాము కోల్పోయే ఆదాయానికి నష్టపపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. కానీ కేంద్రం ఇవ్వదు.

కేంద్రం తాము జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని తేవాలనుకున్నా రాష్ట్రాలే అడ్డుకున్నాయని ప్రచారం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. లేదంటే పెట్రోల్ డీజిల్‌పై పన్నులు ఏ మాత్రం తగ్గకుండా జీఎస్టీలో చేర్చే అతి తెలివిని ప్రదర్శించే చాన్స్ ఉందంటున్నారు. ఇరవై ఎనిమిది శాతం శ్లాబ్ రేట్‌లోకి పెట్రోల్, డీజిల్‌ను చేర్చి దానిపై సెస్సులు, టాక్సులు విధించడం. అలా చేస్తే పెట్రోల్ ధర ఏ మాత్రం తగ్గదనే అంచనా ఉంది. ఎలా చూసినా ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close