కేటీఆర్ వర్సెస్ కవిత: కెసిఆర్ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతోందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతోందా? దీని కారణంగానే కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నా, ఆ నిర్ణయం వాయిదా పడుతోందా? అనూహ్యంగా కవితను ముఖ్య మంత్రి చేయాలన్న వాదనలు కేసీఆర్ ఇంట్లో తెరపైకి వచ్చాయా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణక్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే అనేకమంది రాజకీయ నాయకులు తమ వారసులను సరైన రీతిలో ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కుటుంబం నుండి సరైన రీతిలో వారసులను ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అవ్వడాన్ని, సోనియా గాంధీ రాహుల్ గాంధీని సరైన రీతిలో ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అవ్వడాన్ని దగ్గరనుండి గమనించిన కెసిఆర్ ఆ పొరపాటు తాను చేయకూడదు అన్న ఉద్దేశంతో, మొదటి నుండి కూడా కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తూనే వచ్చారు. తాను అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం ఫలించి ఉన్నట్లయితే బహుశా ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ అది వర్కౌట్ కాకపోవడం తెలిసిందే. ఇక అప్పటినుండి ఎప్పుడో ఒకప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అన్న ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేటీఆర్ వర్సెస్ కవిత కోల్డ్ వార్ జరుగుతుంది అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, ఇటీవలికాలంలో కవిత ను ముఖ్యమంత్రి ని చేయాలని కేసీఆర్ పై వివిధ వర్గాల నుండి ఒత్తిడి ఎదురవుతోంది. ముఖ్యంగా పండితుల మీద, జాతకాల మీద విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ తో, కొందరు పండితులు జాతకరీత్యా కేటీఆర్ అంటే కవితకి రాజ్యాధికారం ఇస్తే పార్టీ మనుగడ గొప్పగా ఉంటుందని సూచించినట్లు సమాచారం. ఈ కారణంగానే, కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలన్న కేసీఆర్ ఆలోచన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని సమాచారం. అయితే పార్టీలో ఇప్పటికే కవిత కంటే కేటీఆర్ పట్ల ఎక్కువ సానుకూలత ఉన్న సంగతి తెలిసిందే.

అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ చర్చల లో ఎంత వరకు నిజం ఉంది, నిజంగా కేసీఆర్ కుటుంబం లో కోల్డ్ వార్ జరుగుతోందా, లేక టిఆర్ఎస్ పార్టీ లో అయోమయం సృష్టించడానికి విపక్షాలు ఈ ప్రచారాన్ని తెర పైకి తీసుకు వచ్చాయా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

బీజేపీ-జనసేన పొత్తులో “నమ్మకం” మిస్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై జంకూ గొంకూ లేకుండా విరుచుకుపడుతున్నారు. అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీలో పోరాడకుండా గల్లీలో ఆడుతున్న డ్రామాలను నిలదీస్తున్నారు. మున్సిపల్...

పేకాడితే తప్పేంటి ..? ఎదురుదాడే మంత్రుల కవరింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తాము ఏం చేసినా కరెక్టేనని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఏ అంశంపైనైనా విమర్శిస్తే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇతర విషయాల సంగతేమో కానీ.. పేకాట విషయంలోనూ అదే వాదన...

తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల్లో కులమే హాట్ టాపిక్…!

కులాల రొచ్చు ఆంధ్రలోనే ఎక్కువ అని ఇప్పటి వరకూ అనుకుంటూ ఉంటాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఉన్నా లేకపోయినా... కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ నేతలు నేరుగా కులం...

HOT NEWS

[X] Close
[X] Close