రేవంత్ రెడ్డి పలుకుబడిని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తగ్గిస్తే తమ పని సులువు అవుతుందని కేటీఆర్ చాలా కాలంగా ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి దానికి రాహుల్‌కు ట్యాగ్ చేయడం, ఆయన బీజేపీకి దగ్గరయ్యారని ప్రచారం చేయడంతో పాటు ..రేవంత్ పనైపోయిందని తెలంగాణలోనూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ రాను రాను రేవంత్‌కు హైకమాండ్ వద్ద పలుకుబడి పెరుగుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని తానే స్వయంగా సిఫారసు చేయడంతో అది తేలిపోయింది. అయినా కేటీఆర్ మాత్రం తన ప్రయత్నాలను ఆపడంలేదు.
తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి రేవంత్ బీజేపీ ఒక్కటేనని వాదించారు. మధ్యలో రాహుల్ గాంధీ ఆటలో అరటి పండు అయ్యారని జాలి చూపించారు. బీజేపీ ఎంపీకి రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందని.. రేవంత్ పై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని ఇలా తనకు తెలిసిన కారణాలన్నీ చెబుతున్నారు. కేటీఆర్ ఎన్ని ప్రచారాలు చేసినా.. ఏవ వర్కవుట్ కావడం లేదు. రేవంత్ పలుకుబడి అంతకంతకూ పెరుగుతోంది. నిజంగా బీజేపీ ఆయనను కాపాడుతూంటే .. ఏ విషయంలో కాపాడుతుందో కేటీఆర్ బలంగా చెప్పాలి. కానీ ఏదో ఆరోపణ చేసి.. దానిపై చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి కాపాడుతోందని ప్రచారం చేసుకుంటున్నారు.
ఓ వైపు ఆయన మిత్రోం జగన్ రెడ్డి మాత్రం.. రేవంత్..చంద్రబాబు .. రాహుల్ మధ్య హాట్ లైన్ ఉందని చెబుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం.. మోదీ, రేవంత్ మధ్య హాట్ లైన్ ఉందన్నట్లుగా చెబుతున్నారు. ఇద్దరు మిత్రులు భిన్నంగా తమ వాదనలు చెబుతున్నపటికీ.. వారిద్దరిదీ ఒకటే విఫల స్ట్రాటజీ. తమ ప్రత్యర్థులపై వారి మిత్రుల్లో అనుమానాలు రేపడం. ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయాలు ఎంత వర్కవుట్ అవుతాయో అంచనా వేయడం కష్టమే. అయినా ఇద్దరు మిత్రులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.