సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు ఏర్పాటు చేసిన సభ కూటమి ఐక్యతకు ప్రదర్శనగా నిలిచింది. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటించాలని అనుకున్న సమయంలో ఆయన వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలను ప్లాన్ చేసినట్లుగా సాగిపోయింది. కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. బహిరంగసభలో ప్రధాని మోదీపై లోకేష్, పవన్, చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కూటమి పదిహేనేళ్ల కంటే ఎక్కువ కాలం బలంగా ఉండాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందని ఎన్డీఏ హయాంలో 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందన్నారు. .అభివృద్ధికి ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుంది… సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నానన్నారు.
దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం ఏపీ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరమన్నారు. భారత్ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది… ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారిందని ప్రశంసించారు. మోదీ పర్యటన ఉంతా ఉత్సాహంగా సాగింది. అధ్యాత్మికంగా ఆలయ సందర్శన , ధ్యానం చేశారు. మోదీ వెంట చంద్రబాబు, పవన్ కూడా ఉన్నారు.
కర్నూలు సభ కూటమి మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరోసారి ప్రజల ముందు ఉంచింది. ప్రధాని మోదీ ఏపీపై, ఏపీ నాయకులపై తనకు ఉన్న అభిమానాని మరోసారి చూపించారు.