అన్నా నువ్వెందుకు రోడ్ షో పెట్టుకో..జనజాతరను మేం చేస్తాం అని జగన్ రెడ్డికి హామీ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్,కన్నబాబు నిండా ముంచేశారు. అరవై కిలోమీటర్ల భారీ యాత్రలో కనీసం రెండు కిలోమీటర్లకు ఓ చోట అయినా స్కిట్స్ ఏర్పాటు చేస్తారనుకుంటే.. మొత్తంగా పరువుపోయేలా చేశారు. ఒక్కో చోట కనీసం రెండు వందల మందిని కూడా పోగుచేయలేకపోయారు. దీంతో సాక్షి మీడియా గ్రాఫిక్స్ మీద ఆధారాపడాల్సి వచ్చింది. క్లోజప్ షాట్లకే పరిమితమయింది.
మాకవరం పాలెం వరకూ రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి జగన్ కు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.కాన్వాయ్ లో పది వాహనాలకు అనుమతి ఇచ్చారు. కానీ గుడివాడ అమర్నాత్ మా ఇష్టం వచ్చినన్ని వాహనాలతో వెళ్తాం.. జన సమీకరణ చేస్తామని ప్రకటించారు. నిజంగానే.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తే కరూర్ తరహా ఘటనలు జరుగుతాయేమో అని పోలీసులు కంగారు పడ్డారు. తీరా జగన్ రెడ్డి విశాఖకు వచ్చాక.. ఆయన షో చేస్తారని అనుకున్న పాయింట్లలో రెండు వందల మంది కూడా లేరు. వారిలో అడ్డాకూలీలే ఎక్కువ మంది ఉన్నారు.
భారీగా జన సమీకరణ చేస్తామని హామీ ఇచ్చిన నేతుల ఎవరూ స్పందించలేదు. దీంతో జగన్ పరువు పోయినట్లయింది. అదే సమయంలో నర్సీపట్నం నుంచి వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా పోయి టీడీపీలో చేరిపోయింది. జగన్ రెడ్డి వచ్చే రోజే ఇలా జరగడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. జగన్ రెడ్డి ఎన్ని స్కిట్లు ప్రదర్శించినా.. మొత్తం గుట్టు బయట పెట్టడానికి పోలీసులు కూడా రెడీగా ఉంటున్నారు. ఈ మెడికల్ కాలేజీ యాత్ర ద్వారా జగన్ రెడ్డి మరోసారి పరువు పోగొట్టుకున్నట్లు అవుతుంది.