మెగాఫోన్ ప‌ట్ట‌నున్న మ‌రో రైట‌ర్‌

ద‌ర్శ‌కులుగా మారిన రైట‌ర్ల‌కు ఇప్పుడు మంచి డిమాండ్‌. కొర‌టాల శివ‌, అనిల్ రావిపూడి ర‌చ‌యిత‌లుగా ఓ వెలుగు వెలిగి – ఆ త‌ర‌వాత మెగాఫోన్ ప‌ట్టిన‌వాళ్లే. ఈ జాబితాలో మ‌రో ర‌చ‌యిత చేర‌బోతున్నాడు. త‌నే లక్ష్మీభూపాల‌. చంద‌మామ‌, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ చిత్రాల విజ‌యాల్లో ల‌క్ష్మీ భూపాల పాత్ర చాలానే ఉంది. ఎప్ప‌టి నుంచో మెగాఫోన్ ప‌ట్టాల‌ని ఆయ‌న ఆలోచ‌న‌. ఇప్పుడు అది నిజం కాబోతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న కెప్టెన్ కుర్చీలో కుర్చుని `స్టార్ట్‌.. కెమెరా..యాక్ష‌న్‌` చెప్ప‌బోతున్నారు.

ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మ‌రోవైపు లక్ష్మీభూపాల సొంత నిర్మాణ సంస్థ‌ని ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త‌న బ్యాన‌ర్ నుంచి కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కూడా త్వ‌ర‌లోనే రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు ఆరోగ్యం అత్యంత విష‌మం

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం.. ఈరోజు మ‌రింత క్షీణించింది. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. కాసేప‌ట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుద‌ల చేయ‌నున్నారు....

బుగ్గనకు నెలాఖరు కష్టాలు.. ఢిల్లీలో నిధుల వేట..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు...

“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ...

కొడాలి నాని సంయమనం కోల్పోయి ఉండవచ్చు : సజ్జల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి...

HOT NEWS

[X] Close
[X] Close