చనిపోయిన ఎన్టీఆర్‌తో మాట్లాడే చాన్స్ మిస్ చేసుకున్న లక్ష్మిపార్వతి !

ఈ మధ్య ఎవరో రాత్రి పన్నెండు గంటలకు నాన్నతో.. తర్వాత ఒంటిగంటకు తాతతో మీటింగ్ ఉంటుందని చెబితే నమ్మలేదు కానీ ఇప్పుడుచాలా మంది నేరుగా అలాంటి అనుభవాలతో తెర ముందుకు వస్తున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతికి.. చనిపోయిన ఎన్టీఆర్‌తో మాట్లాడే చాన్స్ వచ్చిందట. కానీ ఆమె తన్నుకొచ్చిన ఏడుపు వల్ల మాట్లాడలేక చాన్స్ మిస్ చేసుకుంది. ఆమె ఏడుపు చూసో లేకపోతే.. మరో కారణమో కానీ ఆమె ఏడ్చి చూసే సరికి ఏన్టీఆర్ లేరు. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు.. ఆమెనే చెప్పారు.

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి.. ఇరవై ఆరేళ్ల తర్వాత ఓ షాకింగ్ వార్త చెబుతానంటూ మీడియా అందర్నీ అటెన్షన్‌లో పెట్టారు. ఆ తర్వాత ఏంజరిగిందో చెప్పారు. ” ఎన్టీఆర్ గారు చనిపోగానే ఆయన ఆత్మతో మాట్లాడదామని నేనే ప్రయత్నం చేశాను. జీవితా రాజశేఖర్ నన్ను మద్రాసు తీసుకెళ్లి కుముద్విని అనే 16 ఏళ్ల అమ్మాయితో కలిపించారు. ఆ అమ్మాయి ఎన్నో ఆత్మలను తనలో ప్రవేశింపజేసుకొని వారితో అన్ని మాట్లాడిస్తూ ఉంటుంది. అలా చాలా మంది ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్లేవారు. అలా నా భర్త ఎన్టీఆర్ కూడా నాకు ఏం చెప్పారో తెలుసుకుందామని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లా. నేను వెళ్లగానే ఆ అమ్మాయి ఎన్టీఆర్‌లా ప్రవర్తించింది. ఆ హావభావాలు, ఒంటితీరు, కూర్చొనే తీరు మొత్తం ఎన్టీఆర్‌లా వ్యవహరించింది. ఆ స్థితిలో ఆమెను నేను ఎన్నో ప్రశ్నలు అడుగుదామని అనుకున్నా.. కానీ, దు:ఖం తన్నుకొచ్చి ఏమీ అడగలేకపోయాను” అంటూ నిట్టూర్చారు.

ఇంకా ఎన్టీఆర్ ఏమైనా చెప్పి ఉంటారేమో అని మీడియా ప్రతినిధులు చాలా కుతుహలానికి గురయ్యారు కానీ.. లక్ష్మి పార్వతి ఆ చాన్స్ మిస్ చేసుకున్నారు. ఆత్మలతో ప్రేతాత్మలతో మాట్లాడుతామని.. చాలా మంది ఇటీవలి కాలంలో చెబుతూ వస్తున్నారు. అలాంటి వారందర్ని చూస్తూంటే… త్వరలోనే.. మనుషుల్లోనే ఊహాతీత వ్యక్తులున్నారని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ అయితే “మర్డర్” కేసులోనూ మినహాయింపులేనా !?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూండటం వివాదాస్పదమవుతోంది. అసలేమీ జరగకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పోలీసులు ఇక్కడ స్వయంగా హత్య జరిగినట్లుగా...

ఫిల్మీ ఫెస్టివ‌ల్‌: ఈ సంక్రాంతికి ఆరు సినిమాలా?

2022 సంక్రాంతి చ‌ప్ప‌గా సాగిపోయింది. పెద్ద సినిమాలులేక‌పోవ‌డం, వ‌చ్చిన సినిమాలు ఆడ‌క‌పోవడంతో సంక్రాంతి శోభే లేదు. అయితే 2023 ఇలా కాదు. పెద్ద సినిమాలు ఈసారి హోరెత్తించ‌బోతున్నాయి. బాక్సాఫీసుకి కొత్త క‌ళ తీసుకురాబోతున్నాయి....

కోనసీమలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. జిల్లాకు పేరు మార్చమని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో...

హ‌మ్మ‌య్య… ముఖేష్ గాడి గోల లేదు

ఏ సినిమాకెళ్లినా... ముఖేష్ యాడ్ ని భ‌రించాల్సిందే. హాయిగా సినిమా చూద్దామ‌ని వస్తే.. ఈ గోలేంట్రా అని త‌ల‌లు ప‌ట్టుకుంటుంటారు ప్రేక్ష‌కులు. కాక‌పోతే.. ధూమ‌పానం, మద్య‌పానం గురించి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన బాధ్య‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close