ఆర్జీవీ ట్రాప్‌లో పడేందుకు సిద్ధంగా లేని మెగా ఫ్యాన్స్ !

అదిగో పులి అని మొదటి సారి అరిస్తేఎవరైనా అలర్ట్ అవుతారేమో కానీ.. అది అబద్దమని తెలిసినా పదే పదే అరిస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అదే. ఆయన అల్లునే మెగా అంటూ ఓ ట్వీట్ కొత్త వివాదానికి తెర తీశాను.. ఇక మెగా ఫ్యామిలీలో రెండు వర్గాలు అయిపోతాయని ఆయన ఫీలయ్యాడు. కానీ ఆయన ట్వీట్ గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేకుండా పోయింది.

హిందీలో అల్లు అర్జున్ పుష్పకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ సినిమాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. దీన్ని చూసే ఇలా ఆర్జీవీ డిక్లేర్ చేసి… కొత్త పంచాయతీ పెట్టాలనుకున్నారు. కానీ ఆర్జీవీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ గేమ్‌లో భాగం అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. రేపు ఆర్‌ఆర్ఆర్‌ రిలీజ్ అయితే.. వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది. అప్పుడు ఆర్జీవీ ఏమంటారో కానీ.. అలాంటి అవకాశం కోసం ఎదురు చూడకుండా ముందుగానే ఓ ట్వీట్ పెట్టి పంచాయతీ చూద్దామనుకున్నారు.

గతంలోనూ ఇలాంటి అతి తెలివి తేటల్ని ఆర్జీవీ ప్రయోగించి… తను వార్తల్లో ఉండాలనుకున్నారు. కానీ మెగా క్యాప్ వ్యూహాత్మకంగా వ్యవహరించి… ఇగ్నోర్ చేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోంది. ఆర్జీవీ లాంటి వారు టైంపాస్.. చేసి కాస్త పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూంటారు.. అలాంటి వారి ట్రాప్‌లో పడటం దండగని మెగా ఫ్యాన్స్ గుర్తించిటన్లుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ‌శౌర్య టైటిల్ ‘రంగ‌బ‌లి’?

ఇటీవ‌లే 'కృష్ణ వ్రింద విహారి'తో ఆక‌ట్టుకొన్నాడు నాగ‌శౌర్య‌. ఇప్పుడు ఓ కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ప‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీనికి 'రంగ‌బ‌లి' అనే ప‌వర్‌ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. 'రంగ' అనే...

రేపట్నుంచే విశాఖ నుంచి జగన్ పాలన చేస్తే ఎవరాపుతారు .. మినిస్టర్ !?

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై స్టే రాలేదు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నట్లుగా ఫలానా తేదీలోపు కట్టివ్వాలన్న అన్న అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ వైసీపీ నేతలు దాన్ని చిలువలు..పలువుగా చెప్పుకుంటున్నారు. స్టే...

నేనే వాళ్ల‌కు పోటీ: చిరంజీవి

చిరంజీవి సాధించిన అవార్డుల జాబితాలో మ‌రోటి చేరింది. ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాటిలీ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డుని చిరంజీవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గోవాలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ చల‌న చిత్రోత్స‌వాల్లో భాగంగా...

కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ – ఎవరీయన ?

ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో హఠాత్తుగా సీబీఐ అధికారులు రెయిడ్ చేసి... కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే.. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయాలని.. హైదరాబాద్, విశాఖ సీబీఐ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close