తొలి రెండు వేవ్స్‌లో తప్పించుకున్న వారిని వదిలి పెట్టని కరోనా !

కరోనా ధర్డ్ వేవ్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ సారి ప్రత్యేక ఏమిటంటే తొలి సారి కరోనా సోకింది అనిచెప్పేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. రెండో సారి..మూడో సారి సోకినవాళ్లు కూడా ఉన్నారు కానీ.. గత రెండు వేవ్స్‌లో తప్పించుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. సెలబ్రిటీల్లో ఇలాంటి వారు ఎక్కువగా తాము కరోనా బారినప డ్డామని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్, తెలంగాణ డీఎం హెచ్‌వో సహా పలువురు సెలబ్రిటీలు తొలి రెండు వేవ్స్ సమయంలో కరోనా బారి నుంచి తప్పించుకోగలిగారు.

కానీ ఇప్పుడు మాత్రం తప్ప లేదు. కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందని వరుసగా నమోదవుతున్న కేసులు మాత్రమే కాదు… నమోదవ్వని.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి ఎంత మందికి సోకిందో లెక్కలు తీసుకుంటే బయటపడిపోతోంది. మొత్తంగా గతంతో పోలిస్తే ఇప్పుడు కరోనా ను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం కూడా తగ్గిపోయింది. మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్ సమయంలో అయినా శ్మశానాలు పట్టలేదు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.

దేశంలో కొన్ని చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే.. వచ్చే సీజన్‌ నుంచి కరోనాను సాధారణ ఫ్లూగా భావించే అవకాశం ఉంది. ఇప్పటికే క్వారంటైన్ నిబంధనలను వారానికి తగ్గించేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వచ్చే ఆరు నెలల్లో కరోనా పరిస్థితి పూర్తిగా తగ్గిపోతుదంని.. ఫ్లూగా మారిపోతుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే ఓ భయం మాత్రం ప్రపంచానికి తప్పుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ అయితే “మర్డర్” కేసులోనూ మినహాయింపులేనా !?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూండటం వివాదాస్పదమవుతోంది. అసలేమీ జరగకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పోలీసులు ఇక్కడ స్వయంగా హత్య జరిగినట్లుగా...

ఫిల్మీ ఫెస్టివ‌ల్‌: ఈ సంక్రాంతికి ఆరు సినిమాలా?

2022 సంక్రాంతి చ‌ప్ప‌గా సాగిపోయింది. పెద్ద సినిమాలులేక‌పోవ‌డం, వ‌చ్చిన సినిమాలు ఆడ‌క‌పోవడంతో సంక్రాంతి శోభే లేదు. అయితే 2023 ఇలా కాదు. పెద్ద సినిమాలు ఈసారి హోరెత్తించ‌బోతున్నాయి. బాక్సాఫీసుకి కొత్త క‌ళ తీసుకురాబోతున్నాయి....

కోనసీమలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. జిల్లాకు పేరు మార్చమని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో...

హ‌మ్మ‌య్య… ముఖేష్ గాడి గోల లేదు

ఏ సినిమాకెళ్లినా... ముఖేష్ యాడ్ ని భ‌రించాల్సిందే. హాయిగా సినిమా చూద్దామ‌ని వస్తే.. ఈ గోలేంట్రా అని త‌ల‌లు ప‌ట్టుకుంటుంటారు ప్రేక్ష‌కులు. కాక‌పోతే.. ధూమ‌పానం, మద్య‌పానం గురించి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన బాధ్య‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close