చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ !

మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ పుట్టిన రోజలకు కూడా విష్ చేస్తూ ట్వీట్లు పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం కోలుకోవాలని ట్వీట్ పెట్టడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న తర్వాత.. అందరూ స్పందించారు.. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

అయితే కర్ర విరగకుండా .. పాము చావకుండా స్పందించారని ఇది పద్దతి కాదని టీడీపీ నేతల నుంచి కామెంట్లు వచ్చాయి. అయితే రాజకీయాలకు .. దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఈ అంశాలపై లైట్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన పేరును ఇతర పార్టీలు వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాయి. కుప్పం లాంటి చోట్ల చంద్రబాబు పర్యటనల్లో ఓ పది మంది గుమికూడి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నినాదాలు చేయడం కామన్ అయిపోయింది.

వైసీపీ నేతలే ఇలాంటి వారిని తయారు చేసి.. నినాదాలు చేసి.. అనుకూలమైన మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని టీడీపీకి స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ విషయం పెద్దగా హైలెట్ కాలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్.. తన సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలతోనూ ఇటీవలి కాలంలో కలిసిన సందర్భాలు లేవు. అయితే వీలైనంత వరకూ వివాదాల్లోకి రాకుండా ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ లో కొత్త జోక్‌: మంచు వారి ‘100 కోట్ల‌’ సినిమా

మంచు మోహ‌న్ బాబు, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాట‌ల్లో కాస్త అతిశ‌యోక్తులు క‌నిపిస్తుంటాయి. దాంతో అన‌వ‌స‌రంగా ట్రోల్ అవుతుంటారు. వీళ్లెప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. మీమ్స్ కి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటారు. తాజాగా...

రాజ‌మౌళి మైండ్‌లో ‘ఈగ 2

రాజ‌మౌళి ఎప్పుడూ సీక్వెల్స్‌పై దృష్టి పెట్ట‌లేదు. కానీ ఈమ‌ధ్య త‌న దృష్టి అటు వైపే వెళ్తోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌కి రెండో భాగం ఉందంటూ ఆమ‌ధ్య ఓ హింట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు ...

ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ సజ్జల భార్గవ !

సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు .. ఎలాంటి జనబలం లేకపోయినా ప్రభుత్వాన్ని అలవోకగా నడుపుతున్న వ్యక్తి. వ్యవస్థలన్నింటినీ ఎలా వాడేసుకోవాలో పీహెచ్‌డీ చేసిన ఘనుడు. అలాంటి వ్యక్తి కుమారుడు ఎలా ఉండాలి ?...

మీడియా వాచ్ : నెంబర్ 1 పేరుతో పరువు తీసుకుంటున్న చానళ్లు !

గత వారం తాము నెంబర్ వన్ అయ్యామంటూ.. టీవీ9 బృందం .. స్క్రీన్ మీదకు వచ్చి చేసిన హడావుడి తర్వాత.. చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే.. అదేమిటటి.. టీవీ9 ఇప్పటి వరకూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close