విడాకుల సైడ్ ఎఫెక్ట్స్ : ర‌జ‌నీ ఫ్యాన్స్ VS ధ‌నుష్ ఫ్యాన్స్‌

విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చి 24 గంట‌లు గ‌డిచిందో లేదో.. అప్పుడే త‌మిళ నాట ర‌జ‌నీ ఫ్యాన్స్, ధ‌నుష్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైపోయింది. ధ‌నుష్‌ని అన‌వ‌స‌రంగా అల్లుడ్ని చేసుకున్నారంటూ.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌, అస‌లు ఈ వ్య‌వ‌హారంలో ఐశ్వ‌ర్య‌దే త‌ప్పంటూ.. ధ‌నుష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో సై అంటే సై అంటూ.. మాట‌ల‌తో త‌ల‌ప‌డుతున్నారు. `వి స‌పోర్ట్ ధ‌నుష్‌`, `వి స‌పోర్ట్ ఐశ్వ‌ర్య‌` అంటూ.. హ్యాష్ ట్యాగులు త‌మిళ నాట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఒక్క‌టిగా ఉన్న ర‌జ‌నీ, ధ‌నుష్ ఫ్యాన్స్ మ‌ధ్య 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే… ఓ గోడ వ‌చ్చేసింది. అదీ… విడాకుల సైడ్ ఎఫెక్ట్ అంటే.

నిజానికి… త‌మిళ నాట ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌ల విడాకులు ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. స్టార్ జంట విడిపోయేట‌ప్పుడు.. ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేయ‌డానికి కొన్ని రూమ‌ర్లు, ఫీల‌ర్లు వ‌దులుతుంటారు. ఆ త‌ర‌వాత‌.. అస‌లు విష‌యాన్ని రివీల్ చేస్తారు. స‌మంత – నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారంలో ఇదే జ‌రిగింది. స‌మంత `అక్కినేని` అనే పేరు తొల‌గించి, ఫ్యాన్స్ ని స‌న్న‌ద్ధం చేసింది. ఆ త‌ర‌వాత జ‌రిగిన వ్య‌వ‌హారం అంతా తెలిసిందే. అందుకే స‌మంత – నాగచైత‌న్య విడిపోవ‌డం పెద్ద షాకింగ్ విష‌యం అనిపించ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు అలా కాదు. ఇది స‌డ‌న్ గా తీసుకున్న నిర్ణ‌య‌మే అనిపిస్తోంది. రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ..అంతా బాగానే ఉన్న‌ట్టు క‌నిపించింది. ఒక‌రి గురించి ఒక‌రు ట్వీట్లు చేసుకోవ‌డం, పార్టీల‌కు వెళ్ల‌డం.. జ‌రిగాయి. కానీ రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇన్ని పొర‌పొచ్చాలు వ‌చ్చి, విడిపోయి, విడాకుల వర‌కూ ఎలా వెళ్లిపోయార‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌ల మ‌ధ్య గ్యాప్ యేడాది నుంచే ఉంద‌ని, కానీ… ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని, పెద్ద‌లు రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నాలు చేశార‌ని, కానీ అవి స‌ఫ‌లం కాలేద‌ని, ర‌జ‌నీకాంత్ కూడా `మీ జీవితం మీ ఇష్టం` అని తేల్చేసిన త‌ర‌వాతే విడాకుల నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close