జ‌గ‌న్ కి థ్యాంక్స్ చెప్పిన నాగ్‌

సినిమా టికెట్ రేట్లు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై ఇటీవ‌ల చిరంజీవి – జ‌గ‌న్ ల మ‌ధ్య భేటీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ భేటీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలిసింది.కాక‌పోతే.. ఎవ‌రేం మాట్లాడుకున్నారో, జ‌గ‌న్ ఎలాంటి హామీలిచ్చారో మాత్రం బ‌య‌ట‌కురాలేదు. చిరు సైతం `చిత్ర‌సీమ‌కుత్వ‌ర‌లో మంచి రోజులు వ‌స్తాయి` అనే ఆశాభావం వ్య‌క్తం చేశారు త‌ప్ప‌, డిటైల్స్ లోకి వెళ్ల‌లేదు. చిరు మీటింగ్ అయిపోయాక‌.. దానిపై ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు వినిపించాయి. చిరుని జ‌గ‌న్ ఆహ్వానించ‌లేద‌ని, చిరునే అప్పాయింట్ మెంట్ అడిగి వెళ్లార‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒప్పందాలు జ‌రిగాయ‌ని ఏవోవే టాక్స్ బ‌య‌ట‌కువ‌చ్చాయి. ఇదంతా ఎందుకంటే… రాజ‌మండ్రిలో `బంగార్రాజు` స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్టేజీపై నాగ్ మాట్లాడుతూ.. జ‌గ‌న్ – చిరుల భేటీ ని గురించి ప్ర‌స్తావించారు. ”మొన్న‌నే చిరంజీవిగారితో మాట్లాడాను. ‘జ‌గ‌న్ తో మీటింగ్ అయ్యింది క‌దా.. ఏం మాట్లాడుకున్నారు’ అని అడిగాను.. ‘చిత్ర‌సీమ‌కు అంతా మంచే జ‌రుగుతుంది’ అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కి థ్యాంక్స్‌” అన్నారు నాగ్‌. దాన్ని బ‌ట్టి… త్వ‌ర‌లోనే చిత్ర‌సీమ క‌ష్టాలు తీరిపోతాయ‌ని అటు చిరుతో పాటు ఇటు నాగ్ కూడా బ‌లంగానే న‌మ్ముతున్నార‌నిపిస్తోంది. నిజానికి ఈ మీటింగ్ కి నాగ్ కూడా వెళ్లాల్సింద‌ట‌. కానీ… `బంగార్రాజు` ప్ర‌మోష‌న్ల కోసం నాగ్ ఆగిపోవాల్సివ‌చ్చింది. ఏపీలో ‘బంగార్రాజు’ కోస‌మే నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌న్న ఆలోచ‌న‌ని జ‌గ‌న్ వాయిదా వేశార‌ని, సంక్రాంతి అయిపోయిన త‌ర‌వాతే.. నైట్ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ని అమ‌లులోకి తెచ్చారని ఫిల్మ్‌న‌గ‌ర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఆ లెక్క‌న చూసినా… జ‌గ‌న్ కి నాగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close