అస‌లైన బంగార్రాజు నాన్న‌గారే: నాగార్జున‌

ఈ సంక్రాంతి ‘బంగార్రాజు’దే. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్లు తెచ్చుకుంది. సోమ‌వారం కూడా వ‌సూళ్ల హ‌వా త‌గ్గ‌లేదు. ఈ వ‌సూళ్లు, అంకెలు నాగ్ ని సంతోషంలో ముంచెత్తాయి. ఆ ఆనందం.. రాజ‌మండ్రి స‌క్సెస్ మీట్ లో క‌నిపించింది. ”నాకు వ‌సూళ్లు ముఖ్యం కాదు… నా అభిమానుల సంతోష‌మే ముఖ్యం” అంటూ ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు నాగ్‌. త‌ను బంగార్రాజు కాద‌ని, అస‌లైన బంగార్రాజు నాన్న‌గారే అని, ఆయ‌న ఎక్క‌డున్నా.. ఆశీస్సులు అందిస్తూనే ఉంటార‌న్నారు నాగ్. ”ప్ర‌పంచ‌మంతా క‌రోనాకు భ‌య‌ప‌డిపోయింది. ఈ టైమ్ లో సినిమాలు విడుద‌ల చేయొద్ద‌న్నారు. నార్త్ లో సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌పై ఉన్న న‌మ్మకంతోనే బంగార్రాజుని విడుద‌ల చేశాను. మంగ‌ళ‌వారం కూడా హౌస్ ఫుల్స్ న‌డుస్తున్నాయ‌ని విన్నాను. నాకు అంకెలు ముఖ్యం కాదు.. అభిమ‌న‌మే ముఖ్యం ” అని చెప్పుకొచ్చారు నాగార్జున‌. నాగ‌చైత‌న్య‌కూడా ఈ సినిమా విజ‌య‌వంతం అవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. రాజ‌మండ్రితో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని, ఇక్క‌డ ఫంక్ష‌న్ చేసినా, షూటింగ్ చేసినా, సినిమా హిట్ట‌వ్వ‌డం ఖాయ‌మ‌ని, బంగార్రాజుతో ఆ సెంటిమెంట్ మ‌ళ్లీ రిపీట్ అయ్యింద‌న్నాడు చైతూ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close